‘ప్రజల మనిషి’ ఆళ్వారుస్వామి

నిజామాబాద్‌లో జరిగిన ఆంధ్రమహాసభ (1937) వట్టికోట ఆళ్వారుస్వామి జీవి తాన్ని మలుపు తిప్పిందనవచ్చు. ఆసభలో పాల్గొనే వాళ్లంతా తెలుగులోనే మాట్లా డాలని సురవరం ప్రతాపరెడ్డి, మరికొందరు పట్టుపట్టారు. కాని వాళ్ల తీర్మానం వీగిపో యింది. అయినా వారు అంతటితో వదిలేయకుండా ముందుకుపోయారు. తెలుగులో జ్ఞానదా యకమైన పుస్తకాలను ప్రచురించి ప్రజలకు అందజేయాలన్న అళ్వారుస్వామి ఈ సభ ల నుండి ప్రేరణపొంది దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 40 దాకా ఉత్తమ గ్రంథాల ను ప్రచురించి ప్రజలకు పంపిణీ చేశారు. […]

నిజామాబాద్‌లో జరిగిన ఆంధ్రమహాసభ (1937) వట్టికోట ఆళ్వారుస్వామి జీవి తాన్ని మలుపు తిప్పిందనవచ్చు. ఆసభలో పాల్గొనే వాళ్లంతా తెలుగులోనే మాట్లా డాలని సురవరం ప్రతాపరెడ్డి, మరికొందరు పట్టుపట్టారు. కాని వాళ్ల తీర్మానం వీగిపో యింది. అయినా వారు అంతటితో వదిలేయకుండా ముందుకుపోయారు. తెలుగులో జ్ఞానదా యకమైన పుస్తకాలను ప్రచురించి ప్రజలకు అందజేయాలన్న అళ్వారుస్వామి ఈ సభ ల నుండి ప్రేరణపొంది దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 40 దాకా ఉత్తమ గ్రంథాల ను ప్రచురించి ప్రజలకు పంపిణీ చేశారు.

అణాగ్రంథమాలవారు కూడా మంచి పుస్తకా లను ముద్రించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. మూడు శాతం మాత్రమే అక్షరా స్యతఉన్న ఆ రోజుల్లో ఆళ్వారుస్వామి చీకట్లో దీపం వెలిగించారు. అభ్యుదయ రచయి తల సంఘం సీమాంధ్రలో 1943లో ప్రారంభమైంది. 1944 లో దీని శాఖను జంట నగరాలలో స్థాపించి, సభలు నిర్వహిం చింది ఆళ్వారుస్వామే. అంతేకాదు అరసం అధికార పత్రిక ‘తెలుగుదేశం’ ప్రచురణ బాధ్యతలు చేపట్టింది కూడా ఆళ్వారే. సాహిత్య సాంస్కృతిక రాజకీయ సభలకు తమ సతీమణి యశోదమ్మతో కలిసి హాజరయ్యేవారు. కాళోజీ చెప్పినదాన్ని బట్టి – స్త్రీ పురుష సమానత్వాన్ని పాటించిన ఏకైక రచయిత వీరే. సమకాలీన రచయితలకెవరికీలేని కొన్ని ప్రత్యేకతలు ఆళ్వారు స్వామికి ఉన్నాయి. వీరు ట్రేడ్ యూనియన్ రంగానికి నాయకత్వం వహించారు.

గుమాస్తాల సంఘం స్థాపించి, సెలవులులేక వెట్టిచాకిరీ చేస్తున్న గుమాస్తాల కోసం పోరాటం చేసి నెలకు నాలుగు సెలవులు ఇప్పించారు.అంతేకాదు, వారిలో నిరంతరచైతన్యం ప్రోది చేయాలని ‘గుమాస్తా’ పత్రికు నడిపారు. మనుషులు లాగే రిక్షాలను నిజాం ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయించినప్పుడు, వారి కోసం సంఘాన్ని నిర్మించి పోరాటం నడిపారు. దీంతో నిజాం తననిర్ణయాన్ని వెనక్కు తీసుకోవలసివచ్చింది. రైల్వే ఉద్యోగులను ఉద్యో గాల నుండి తొలగించినప్పుడు కూడా ఆళ్వారే ముందుకు వచ్చి పోరాటం చేశారు. దొడ్డి కొమరయ్య హత్య జరిగినప్పుడు (1946) ఆ ప్రాంతానికి నిజ నిర్ధారణ సంఘాన్ని తీసుకుపోయింది వీరే. వీరు ‘మీ జాన్’ పత్రికలో ఆ సంఘం రిపోర్టును ప్రచురించిన తర్వాతనే విసునూరి దేశ్‌ముఖ్, ఆయన గుండాలు సాగించిన హత్యాకాండ గూర్చి ప్రపంచానికి వెల్లడయింది.

పండిత పన్నుతో సహా ఇతర అనవసరమైన పన్నులు వేసి గద్వాల రాణి బీద ప్రజల జీవితాలతో చెలగాట మాడుతున్నప్పుడు ఆ సంస్థానంలో బద్దం ఎల్లారెడ్డితోపాటు ఆళ్వా రుస్వామి పర్యటించారు. రాణి చేస్తున్న అక్రమాలను నివేదిక రూపంలో వెల్లడించటానికి వారు వెనుకాడలేదు.సాహిత్యం ప్రజలకోసం అని గాఢంగా విశ్వసించినవారు ఆళ్వారు స్వామి.వారి తొలి నవల ‘ప్రజల మనిషి’ (1955) తెలంగాన భాషలో తెలంగాణ జీవి తాన్ని చిత్రించిన తొలి నవల కూడా ఈ నవలతో ప్రేరణ పొంది తాము ‘చిల్లర దేవుళ్లు’ వంటి తెలంగాణ నవలలను రాశామని దాశరథిరంగాచార్య చెప్పటం జరిగింది. ‘గంగు’ నవల వారి రెండవదీ, చివరిదీ. అసంపూర్తి నవల కూడా.ఇందులో విశాలమైన ప్రాతి పదిక మీద నిజాంకాలపు తెలంగాణ జీవితాన్ని చిత్రించటానికి పూనుకున్నారు ఆళ్వారు స్వామి. ‘జైలు లోపల’ (1951) కథానికలువారి జైలు అనుభవాలే. ఆ రోజుల్లో రాజ కీయ ఖైదీలుగాఉన్న ఆళ్వారుస్వామి, కాళోజీ, దాశరథి వంటివారు జైలును ఒక సంస్క రణ కేంద్రంగా తయారుచేశారు.

అమాయక గ్రామీణులు చేయని నేరాలకు జైలులో మగ్గుతున్న ఆ రోజుల్లో వారిలో జ్ఞానాన్ని, చైతన్యాన్ని కలుగజేశారు. 1946 నుంచి 1951 వరకు ఐదు సంవత్సరాల పాటు ఆళ్వారుస్వామి వివిధ జైళ్లలో ఉన్నారు. అంతకు ముందు క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ఒక సంవత్సరం పాటు జైలు జీవితం గడిపారు. 1961 నాలుగు ఫిబ్రవరి సాయంత్రం తమ మిత్రులు బి.రుదురాజు రామరాజు, బలరామాచార్యలతో పాలు నాంపల్లిలోని నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు వెళ్లారు. రాత్రి 10 గంటల దాకా ముగ్గురు మిత్రులు సరదాగా తిరిగారు. ఎవరిండ్లకు వారు వెళ్లిపోయారు. ఆ తెల్లవారి ఆళ్వారుస్వామికి గుండెపోటు రావటంతో చివరి శ్వాస విడిచారు. అప్పుడు వారి వయసు నలభైఆరు మాత్రమే.

(5 ఫిబ్రవరి వట్టికోట ఆళ్వారుస్వామి వర్ధంతి)
– అమ్మంగి వేణుగోపాల్ 9441054637

Comments

comments