‘ప్రగతి నివేదన సభ’కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

రంగరెడ్డి: జిల్లాలోని కొంగర కలాన్ లో సెప్టెంబర్ 2న టిఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న ‘ప్రగతి నివేదన సభ’కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సభ కారణంగా 1600 ఎకరాల్లో చెట్లను కొట్టేస్తున్నారనీ, వెంటనే ఈ సభకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలంటూ డిగడ్డ పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్ దాఖలు చేసిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. దాదాపు 1600 ఎకరాలను చదునుచేస్తూ అక్కడి చెట్లను నరికేస్తున్నారని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. […]

రంగరెడ్డి: జిల్లాలోని కొంగర కలాన్ లో సెప్టెంబర్ 2న టిఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న ‘ప్రగతి నివేదన సభ’కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సభ కారణంగా 1600 ఎకరాల్లో చెట్లను కొట్టేస్తున్నారనీ, వెంటనే ఈ సభకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలంటూ డిగడ్డ పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్ దాఖలు చేసిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. దాదాపు 1600 ఎకరాలను చదునుచేస్తూ అక్కడి చెట్లను నరికేస్తున్నారని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే, పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టిఆర్ఎస్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ప్రగతి నివేదన సభకు అనుమతి ఇస్తూ తీర్పును వెల్లడించింది. ఇక తెలంగాణ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లుగా చేసిన అభివృద్ధి పనులు, పథకాలను ప్రజల ముందుకు తీసుకువచ్చేందుకు గాను ఈ సభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Comments

comments

Related Stories: