‘పేపర్‌బాయ్’కు ప్రభాస్ ప్రశంసలు

Prabhas appreciates Paperboy Trailor

‘పేపర్‌బాయ్’ చిత్రానికి తన ప్రశంసలు అందజేశాడు యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత కాసేపు సినిమా యూనిట్‌తో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ “సినిమా ట్రైలర్, పాటలలో మంచి విజువల్స్ కనిపిస్తున్నాయి. శోభన్ నా కెరీర్‌కు ‘వర్షం’ సినిమాతో తొలి విజయాన్ని అందించారు. ఇప్పుడు సంతోష్ కూడా అలాగే విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను. నా ‘బిల్లా’ సినిమాకు పనిచేసిన సౌందర్ రాజన్ ఫొటోగ్రఫీ అద్భుతంగా ఉంది. గీతాఆర్ట్ బ్యానర్ ఈ సినిమా హక్కులను కొనడం మంచి విషయం. సంపత్‌నందికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. ఇక ఈ చిత్రాన్ని ఈనెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. సంతోష్ శోభన్, రియా సుమన్ హీరోహీరోయిన్లుగా తాన్యాహోప్, పోసాని కృష్ణమురళి, అభిషేక్ మహర్షి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతంః భీమ్స్ సిసిరేలియో, ఎడిటర్‌ః తమ్మిరాజు, ఆర్ట్‌ః రాజీవ్.