‘దంగల్’ సిస్టర్స్‌పై వేటు!

న్యూఢిల్లీ : నేషనల్ క్యాంప్‌కు హజరుకానందుకుగాను జాతీయ రెజ్లింగ్ సమాఖ్య(డబ్లుఎఫ్‌ఐ) ఫోగట్ సిస్టర్స్‌పై వేటు వేసింది. అయితే డబ్ల్యుఎఫ్‌ఐ ఫోగట్ సిస్టర్స్‌కు మరో అవకాశం ఇచ్చింది. నేషనల్ క్యాంప్‌కు హాజరుకానందుకు గల కారణాన్ని వివరిస్తే వారిని తిరిగి చేర్చుకునే అవకాశాలను పరిశీలిస్తామని తెలిపింది. కామన్వెల్త్ క్రీడ ల్లో పతకాలు సాధించడమే కాక, వారి జీవిత చరి త్ర ఆధారంగా తెరకెక్కిన ‘దంగల్’ సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఫోగట్ సిస్టర్స్ గీత, బబితలతో పాటు వీరి చెల్లెళ్లు […]

న్యూఢిల్లీ : నేషనల్ క్యాంప్‌కు హజరుకానందుకుగాను జాతీయ రెజ్లింగ్ సమాఖ్య(డబ్లుఎఫ్‌ఐ) ఫోగట్ సిస్టర్స్‌పై వేటు వేసింది. అయితే డబ్ల్యుఎఫ్‌ఐ ఫోగట్ సిస్టర్స్‌కు మరో అవకాశం ఇచ్చింది. నేషనల్ క్యాంప్‌కు హాజరుకానందుకు గల కారణాన్ని వివరిస్తే వారిని తిరిగి చేర్చుకునే అవకాశాలను పరిశీలిస్తామని తెలిపింది. కామన్వెల్త్ క్రీడ ల్లో పతకాలు సాధించడమే కాక, వారి జీవిత చరి త్ర ఆధారంగా తెరకెక్కిన ‘దంగల్’ సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఫోగట్ సిస్టర్స్ గీత, బబితలతో పాటు వీరి చెల్లెళ్లు రీతు, సంగీత కూడా ప్రస్తుతం లక్నోలో నిర్వహిస్తున్న నేషనల్ క్యాంప్ కు హాజరుకాలేదు. ఈ కారణం వల్ల డబ్ల్యుఎఫ్‌ఐ వీరి మీద వేటు వేసింది.దీని గురించి డబ్ల్యుఎఫ్‌ఐ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మాట్లాడుతూ ‘నేషనల్ క్యాంప్‌కు ఎంపికైన ఏ రెజ్లర్ అ యినా మూడురోజుల్లోగా తన శారీరక దృఢత్వం గురించి క్యాంప్‌లో తెలియచేయాలి. ఒకవేళ వా రికి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటి గురించి కోచ్‌కు చెప్పి పరిష్కరించుకోవాలి. అయితే గీతా, బబిత, వారి ఇద్దరు సోదరీమణులు రీతూ, సంగీ త కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కనీసం వారితో మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వలేదు. డబ్ల్యుఎఫ్‌ఐ ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించి, వారిపై క్రమశిక్షణా రహిత్యం కింద చర్యలు తీసుకుంది. ఇక వారు ఇంట్లో కూర్చుని విశ్రాంతి తీసుకోవచ్చ’ని అన్నారు.
గైర్హాజరుకు సరైన కారణం చెప్తే…
డబ్ల్యుఎఫ్‌ఐ ఈ చర్యల వల్ల ఫోగట్ సిస్టర్స్ ఈ ఏ డాది ఆగస్టు -సెప్టెంబర్‌లో ఇండోనేషియాలో జరగబోయే ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం కోల్పోనున్నట్లు సమాచారం. అయితే డబ్ల్యుఎఫ్‌ఐ వీరికి ఒక ఊరట కల్పించింది. ఒకవేళ ఫోగట్ సి స్టర్స్ కనుక వారి గైర్హాజరుకు సరైన కారణాన్ని చె ప్తే వారికి మరో అవకాశం ఇస్తామని శరణ్ సింగ్ తెలిపారు. ఫోగట్ సిస్టర్స్‌తో పాటు రియో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సాక్షి మాలిక్ భర్త స త్యవర్త్ కడియాన్‌పైనా కూడా డబ్ల్యుఎఫ్‌ఐ నిషే ధం విధించింది.కాగా బబిత స్పందిస్తూ.. ‘డబ్ల్యుఎఫ్‌ఐ నాపై వేటు వేసిన సంగతైతే నాకు తెలియ దు. దీనికి సంబంధించి ఎటువంటి నోటీసు కూ డా నాకు రాలేదు. నేను నేషనల్ క్యాంప్‌కు హాజరుకాని మాట వాస్తవం. ఎందుకంటే నేను మోకా లి గాయాలతో బాధపడుతున్నాను. అయితే ఈ విషయం గురించి నేను డబ్ల్యుఎఫ్‌ఐకి సమాచారం ఇవ్వలేదు. ఈరోజే దీని గురించి వారికి తెలియజేస్తాను. అలానే రీతూ, సంగీత రష్యాలో నిర్వహిస్తున్న ట్రైనింగ్ క్యాంప్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ వారికి ఇంకా వీసాలు రాలేదు. ఈ విషయం గు రించి డబ్ల్యుఎఫ్‌ఐను సంప్రదించినా పట్టించుకోలేదు. ప్రస్తుతం గీత బెంగుళూరులో శిక్షణ తీసుకుంటోంది. ఆమె నేషనల్ క్యాంప్‌కు ఎందుకు గైర్హాజరయ్యిందో నాకు తెలియదు’అని చెప్పింది.

Related Stories: