‘గేమ్ చేంజర్ అవార్డు’కు ఇంద్రా నూయి

Indra Nooyi to nominated for Asia Game Changer award

న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా తన వాణిజ్య సాఫలత్యలు, మానవత్వ రికార్డు, మహిళలు, బాలికల కోసం చేసిన కృషికి గుర్తింపుగా భారతీయ సంతతికి చెందిన పెప్సీ కో సిఇఒ ఇంద్రా నూయికి ఈ సంవత్సరపు ‘గేమ్ చేంజర్ అవార్డు’ను ప్రపంచ సాంస్కృతిక సంస్థ ప్రదానం చేయనున్నది. 2018 గేమ్ చేంజర్ అవార్డులను వ్యక్తులకు,సంస్థలకు అక్టోబర్‌లో ఇవ్వనున్నారు. ప్రపంచవ్యాప్తంగా తోటి పౌరులను ప్రేరేపించే విధంగా పనిచేయడమేకాక, ధైర్యాన్ని ప్రదర్శించడం, పనిలో అద్భుతాలు సాధించడం, అడ్డుగోడలు(బారియర్స్) అధిగమించడం వంటి ప్రామాణికాలపై ఈ గేమ్ చేంజర్ అవార్డును వ్యక్తులకు, సంస్థలకు గ్లోబల్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రదానం చేస్తుంది. ‘ఇందిరా నూయి నిజంగానే మార్పు తీసుకొచ్చిన నాయకురాలు. నా ఐక్యరాజ్యసమితి పనిలో ఆమె మానవత్వ నాయకత్వ లక్షణాలని నేను ప్రత్యక్షంగా చూశాను. ఐక్యరాజ్య సమితితో కలసి ఆహారం, పౌష్టికత, ప్రపంచవ్యాప్తంగా తాగునీరు, వాతావరణం, మహిళల సాధికారత అంశాలపై ప్రాణ రక్షక కార్యక్రమాలను ఎన్నింటినో పెప్సీకో చేపట్టేలా ఆమె ఆ సంస్థను నడిపించింది’ అని ఏషియా సొసైటీ అధ్యక్షురాలు, సిఇఒ జోసెట్ షీరన్ చెప్పారు. ఇందిరా నూయి నెల క్రితం పెప్సికో సిఇఒ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆమె పెప్సికోలో 24 ఏళ్లపాటు పనిచేశారు. పెప్సీకోతో పనిచేయడం తనకెంతో భావోద్వేగాల మిళితం అని ఆమె ట్వీట్ చేశారు.

Comments

comments