‘కంటి వెలుగు’ను ప్రారంభించిన సిఎం కెసిఆర్

CM KCR launch kanti velugu
మెదక్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ పథకాన్నిమెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని మల్కాపూర్ లో సిఎం కెసిఆర్ బుధవారం ప్రారంభించారు. కంటి పరీక్షలు చేయించుకున్న ఓ మహిళకు సిఎం స్వయంగా కళ్లద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా కంటి పరీక్షల శిబిరాన్నిపరిశీలించి, కంటి పరీక్షల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఫొటో ప్రదర్శనను కెసిఆర్ వీక్షించారు. దృష్టి లోపంతో బాధపడుతున్న వివిధ వయసులకు చెందిన తెలంగాణ ప్రజలకు కంటి వెలుగు ద్వారా కంటి పరీక్షలు ఉచింతంగా నిర్వహించడంతోపాటు అవసరమైతే కంటికి సంబంధించిన శస్త్ర చికిత్సలు, మందులను ప్రభుత్వ ఖర్చుతో పూర్తిగా ఉచితంగా తెలంగాణ సర్కార్ అందజేయనుంది.

Comments

comments