‘అత్తారింటికి దారేది’ రీమేక్‌లో…

హీరో నితిన్ సరసన వరుసగా రెండు సినిమాల్లో నటించిన యంగ్ బ్యూటీ మేఘ ఆకాష్. లై, చల్ మోహన్ రంగ చిత్రాల్లో తన అందం, అభినయంతో ఆమె ఆకట్టుకుంది. అయితే దురదృష్టవశాత్తు ఆ రెండు సినిమాలు నిరాశపరిచాయి.  ఈ సినిమాలు ఈ భామ కెరీర్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఇక తమిళంలో మేఘ చేస్తున్న రెండు చిత్రాలు అంతకంతకు ఆలస్యమవుతూనే ఉన్నాయి. అవి పూర్తికావు, విడుదల కావు అన్న చందంగా మారింది. దీంతో మేఘ హీరోయిన్ రేసులో […]

హీరో నితిన్ సరసన వరుసగా రెండు సినిమాల్లో నటించిన యంగ్ బ్యూటీ మేఘ ఆకాష్. లై, చల్ మోహన్ రంగ చిత్రాల్లో తన అందం, అభినయంతో ఆమె ఆకట్టుకుంది. అయితే దురదృష్టవశాత్తు ఆ రెండు సినిమాలు నిరాశపరిచాయి.  ఈ సినిమాలు ఈ భామ కెరీర్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఇక తమిళంలో మేఘ చేస్తున్న రెండు చిత్రాలు అంతకంతకు ఆలస్యమవుతూనే ఉన్నాయి. అవి పూర్తికావు, విడుదల కావు అన్న చందంగా మారింది. దీంతో మేఘ హీరోయిన్ రేసులో వెనుకబడింది. చెప్పుకోవడానికి మాత్రం ఈ ఒక్క ఏడాదిలోనే ఆమె మూడు సినిమాలకు సంతకాలు చేసింది. అవి మూడు తమిళ చిత్రాలే కానీ ఏదీ రిలీజ్ కావడం లేదు. తమిళంలో ప్రస్తుతం అధర్వ సరసన ‘బూమరాంగ్’ అనే భారీ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తోంది. కన్నన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై మేఘ చాలానే ఆశలు పెట్టుకుందట. ఇది సెట్స్‌పై ఉండగానే మరో క్రేజీ ఆఫర్ అందుకుంది. టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘అత్తారింటికి దారేది’ తమిళ్ రీమేక్‌లో నటించే ఛాన్స్ మేఘ కొట్టేసింది. ఈ చిత్రాన్ని సుందర్ తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ నెలలోనే చిత్రీకరణ ప్రారంభంకానుంది.

Related Stories: