హ్యాపీ బర్త్‌డే: దేవకి.. సమాజ సేవకి…

తెలుగు, తమిళం, హిందీ, కన్నడ ఇలా అన్నీ ఇండస్ట్రీస్ లో తనదైన నటనతో చక్కటి గుర్తింపు తెచ్చుకుంది ఢిల్లీ భామ శ్రియ శరణ్. అందం-అభినయం శ్రియకు ఈ రెండు ప్రధాన బలం. శ్రియ ఇవాళ(మంగళవారం) 36వ పుట్టినరోజు జరుపుకుంటుంది. 2004లో ‘ఇష్టం’ చిత్రంతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన‌ శ్రియ ఇప్పటికి అదే జోరు కొనసాగిస్తోంది. ఒక హీరోయిన్ దశాబ్ద కాలానికి పైగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడమంటే మాటలు కాదు. ఒకటి రెండు సినిమాలకే కనుమరుగు అయిపోతున్న హీరోయిన్లు ఉన్న ప్రస్తుతం తరుణంలో ఇంత […]

తెలుగు, తమిళం, హిందీ, కన్నడ ఇలా అన్నీ ఇండస్ట్రీస్ లో తనదైన నటనతో చక్కటి గుర్తింపు తెచ్చుకుంది ఢిల్లీ భామ శ్రియ శరణ్. అందం-అభినయం శ్రియకు ఈ రెండు ప్రధాన బలం. శ్రియ ఇవాళ(మంగళవారం) 36వ పుట్టినరోజు జరుపుకుంటుంది. 2004లో ‘ఇష్టం’ చిత్రంతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన‌ శ్రియ ఇప్పటికి అదే జోరు కొనసాగిస్తోంది. ఒక హీరోయిన్ దశాబ్ద కాలానికి పైగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడమంటే మాటలు కాదు. ఒకటి రెండు సినిమాలకే కనుమరుగు అయిపోతున్న హీరోయిన్లు ఉన్న ప్రస్తుతం తరుణంలో ఇంత నిలకడగా అవకాశాలను అందిపుచ్చుకోవడం శ్రియకే చెల్లింది. 36ఏళ్ల వయసులోనూ ఇప్పటి హీరోయిన్లకు తానే మాత్రం తక్కువ కాదని నిరూపిస్తూ మంచి ఫిజిక్స్ ను మెయింటెన్ చేస్తోందామె. ఆ మధ్యలో  రష్యన్ క్రీడాకారుడు ఆండ్రూ కోశ్చీవ్ ని సడెన్ గా పెళ్లాడి పెద్ద షాక్ ఇచ్చిందామె. ఇన్నాళ్లు కెరీర్ కోసం – స్టార్ డమ్ కోసం బడా స్టార్ల వెంట పడిన శ్రీయ ఇక పెళ్లి బంధంతో లైఫ్ లో సెటిలైపోతోందని ఇక టాలీవుడ్ లో కనిపిస్తుందో లేదోనని ఆవేదన అభిమానులు వెల్లగక్కారు. అయితే వాటన్నింటికీ పుల్ స్టాప్ పెడుతూ… బాలయ్య , నాగార్జున , చిరంజీవి, వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్లు ఎవరైనా తనకు ఓ ఛాన్సిస్తే టాలీవుడ్ లో నటించేందుకు తాను ఎప్పుడూ సిద్ధమే అని చెప్పింది. ప్రస్తుతం ఈ భామ నారా రోహిత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘వీరభోగ వసంతరాయలు’ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీలోని శ్రీయ గెటప్ కి సంబంధించిన స్టీల్స్ ను చిత్ర యూనిట్ ఇటీవలే రివీల్ చేసిన సంగతి తెలిసిందే.

Related Stories: