హోటల్ యాజమాన్యం దాష్టీకం..!

మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని టేబుల్ సెవెన్ హోటల్ యాజమాన్యం దాష్టీకానికి పాల్పడింది. హోటల్‌లో పనిచేసే 11 మంది సిబ్బందిని యాజమాన్యం నిర్భందించి చిత్రహింసలకు గురిచేసింది. కుక్కింగ్ మాస్టర్లు, వెయిటర్లను మూడు గదుల్లో బంధించారు. అనంతరం సిబ్బందిపై విచక్షణరహితంగా చావబాదారు. దీంతో బాధితులు యాజమాన్యంకు తెలియకుండా డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు హోటల్‌కు చేరుకుని వారిని విడిపించారు. అనంతరం బాధితులకు ఆస్పత్రిలో వైద్యం అందించి బెల్లంపల్లిలోని వారి స్నేహితుల వద్దకు […]

మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని టేబుల్ సెవెన్ హోటల్ యాజమాన్యం దాష్టీకానికి పాల్పడింది. హోటల్‌లో పనిచేసే 11 మంది సిబ్బందిని యాజమాన్యం నిర్భందించి చిత్రహింసలకు గురిచేసింది. కుక్కింగ్ మాస్టర్లు, వెయిటర్లను మూడు గదుల్లో బంధించారు. అనంతరం సిబ్బందిపై విచక్షణరహితంగా చావబాదారు. దీంతో బాధితులు యాజమాన్యంకు తెలియకుండా డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు హోటల్‌కు చేరుకుని వారిని విడిపించారు. అనంతరం బాధితులకు ఆస్పత్రిలో వైద్యం అందించి బెల్లంపల్లిలోని వారి స్నేహితుల వద్దకు పంపించారు. అయితే, తమ అగ్రిమెంట్ గడువు ముగిసినా హోటల్ యాజమాన్యం పనిచేయించుకున్నట్లు బాధితులు పోలీసులకు తెలిపారు. జీతాలు ఇవ్వాలని కోరితే తమను చిత్రహింసలకు గురిచేసినట్లు వారు వెల్లడించారు. బాధితులను ఒడిశాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

comments

Related Stories: