హోండానుంచి తొలి బిఎస్6 స్కూటీ

Honda Scooter

 

ఈ నెల11న మార్కెట్లోకి యాక్టివా 125 ఎఫ్‌ఐ

న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్, స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) తొలి బిఎస్6 వాహనం హోండా యాక్టివా 125 ఎఫ్‌ఐని ఈ నెల 11న మార్కెట్లో విడుదల చేయనుంది. స్కూటీ కేటగిరీలో మార్కెట్లోకి వస్తున్న తొలి బిఎస్6 వాహనం ఇదే కావడం విశేషం.2020 ఏప్రిల్ 1 lనాటికి ఈ వాహనాన్ని విడుదల చేయాలని మొదట లక్షంగా పెట్టుకున్నారు. కానీ ఏడు నెలలు ముందే హోండా యాక్టివా 125 బిఎస్6 అమ్మకాలు మొదలు కానున్నాయి. హోండా యాక్టివా 125 బిఎస్4 యాక్టివాలో ఉన్నట్లుగానే 125 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

అయితే దీనికి కంపెనీకి చెందిన ప్రత్యేక ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజక్షన్ ( పిజిఎంఎఫ్‌ఐ), ఎన్‌హాన్స్‌డ్ స్మార్ట్ పవర్‌ను జత చేశామన్నారు. చూడడానికి బిఎస్6 యాక్టివా బిఎస్4ను పోలి ఉన్నప్పటికీ కొత్తగా 26 అదనపు హంగులను చేర్చినట్లు తెలిపారు. హెడ్‌లైట్, ముందుభాగం, సైడ్ ప్యానల్స్‌లు స్వల్ప మార్పులు చేశారు. సైడ్ స్టాండ్ వేసి ఉన్నట్లయితే ఇంజిన్ ఆన్ కాకుండా ప్రత్యేక వ్యవస్థను దీనిలో పొందుపరిచారు. కొన్ని అనలాగ్.. కొన్ని డిజిటల్ ఫీచర్లతో.. సగటు ఇంధన ఖర్చు , మిగిలి ఉన్న ఇంధనం, స్పీడోమీటర్, ఒడోమీటర్ లాంటి వాటిని ముందు భాగంలో పొందుపరిచారు. కాగా, బిఎస్4 వాహనంతో పోలిస్తే బిఎస్6 వాహనం ధర పదినుంచి 15 శాతం దాకా ఎక్కువ ఉండే అవకాశం ఉందని తెలిపారు.

Honda Activa 125 FI BS6 to be launched on September 11

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హోండానుంచి తొలి బిఎస్6 స్కూటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.