రోడ్డు ప్రమాదంలో సివిల్స్ అభ్యర్థి మృతి

Untitled-1

హైదరాబాద్: స్నేహితుడి పుట్టిన రోజు వేడుకులకు వెళ్లి వస్తుండగా సివిల్స్ అభ్యర్థి మృతి చెందిన సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మహంత్ కుమార్ నగరంలోని ఎస్ఆర్ నగర్ లో ఓ హాస్టల్ లో ఉంటూ సివిల్స్ మెయిన్స్ కు ప్రిపేర్ అవుతున్నాడు.  ఆదివారం స్నేహితుడి పుట్టిన రోజు కావడంతో మరో  స్నేహితుడు నిఖిల్ తో కలిసి పుట్టిన రోజు వేడుకులకు వెళ్లాడు.  తిరిగి వస్తున్న క్రమంలో లాల్ బంగ్లా దగ్గర అతని  వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహంత్ సంఘటన స్థలంలోనే మరణించాడు. అతని స్నేహితుడు నిఖిల్‌కు తీవ్ర గాయాలు కాగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు.