హైదరాబాద్ పేలుళ్ల కేసుల విచారణ పూర్తి

Hyderabad : Gokul Chat- Lumbini Park Blasts Case Trial Completed

హైదరాబాద్ : గోకుల్ చాట్, లుంబిని పార్క్ పేలుళ్ల కేసుల విచారణ మంగళవారం పూర్తి అయింది. ఈనెల 27వ తేదీన ఎన్‌ఐఎ ప్రత్యేక కోర్టు తీర్పును వెల్లడించనుంది. 2007, ఆగస్టు 25న గోకుల్ చాట్, లుంబిని పార్క్ వద్ద ఉగ్రవాదులు జరిపిన పేలుళ్లలో 42 మంది మృతి చెందారు. మరో 50మంది గాయపడ్డారు. ఈ కేసులో నిందితులుగా అనిక్ షఫీక్ సయ్యద్(ఏ1), మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్(ఏ2), రియాజ్ భత్కల్(ఏ3), ఇక్బాల్ భక్తల్(ఏ4), ఫరూఖ్ షార్ఫూద్దిన్(ఏ5), మహ్మద్ సిద్ధి షేక్(ఏ6), అమీర్ రసూల్ ఖాన్(ఏ7) ఉన్నారు. రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, ఫరూఖ్ ఫార్ఫూద్దిన్, అమీర్ రసూల్ ఖాన్ పరారీలో ఉన్నారు. షఫీక్ సయ్యద్, మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్, మహ్మద్ సిద్ధి షేక్ ప్రస్తుతం జైలులో ఉన్నారు.

Gokul Chat- Lumbini Park Blasts Case Trial Completed

Comments

comments