హైదరాబాద్‌లో పుణె ఎస్ఐ ఆత్మహత్య

SI-Suicide

హైదరాబాద్ : సికింద్రాబాద్ జవహర్ నగర్ లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ గదిలో పుణె ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నారు. పుణెలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న స్వాతి తన స్నేహితురాలిని కలిసేందుకు ఈ నెల 24న హైదరాబాద్ వచ్చారు. మంగళవారం నిసా అకాడమీలోని ఓ గదిలో స్వాతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments