హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులు

Electric buses in Hyderabad

హైదరాబాద్ : హైదరాబాద్ నగర రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. ఆర్‌టిసిని నష్టాలను గట్టిక్కించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నష్టాలను తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 40 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చింది. ప్రస్తుతం ఐదు ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఐదు బస్సులను సీనియర్ ఐఎఎస్‌లు అజయ్ మిశ్రా, అరవింద్ కుమార్‌లు బుధవారం ప్రారంభించారు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 300 కిలోమీటర్ల వరకు ఈ బస్సులు ప్రయాణిస్తాయి. ఒక కిలోమీటర్‌కు ఓ యూనిట్ చొప్పున కరెంట్ ఖర్చు అవుతుంది. ఈ బస్సులతో పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగం ఉంటుంది.

Electric buses in Hyderabad

Comments

comments