హైకోర్టు భవనాన్నిఎపికి ఇచ్చేందుకు సిద్ధం…

న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుపై శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. విచారణ భాగంగా హైకోర్టు విభజన జరగాల్సిందేనంటూ కేంద్రం తరపున వాదించిన అటార్నీ జనరల్ సుప్రీంకోర్టును కోరుతూ… 2015 మే 1న హైకోర్టు డివిజన్ బెంచ్ వెల్లడించిన తీర్పును కొట్టివేయాలని కోరారు. తెలంగాణ సర్కార్ తరపున సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ప్రస్తుతం హైకోర్టులో 24 హాళ్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఎపి ఈ హాళ్లను వాడుకోవచ్చునని చెప్పారు. అవసరమైతే హైకోర్టు భవనం మొత్తాన్ని […]

న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుపై శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. విచారణ భాగంగా హైకోర్టు విభజన జరగాల్సిందేనంటూ కేంద్రం తరపున వాదించిన అటార్నీ జనరల్ సుప్రీంకోర్టును కోరుతూ… 2015 మే 1న హైకోర్టు డివిజన్ బెంచ్ వెల్లడించిన తీర్పును కొట్టివేయాలని కోరారు. తెలంగాణ సర్కార్ తరపున సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ప్రస్తుతం హైకోర్టులో 24 హాళ్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఎపి ఈ హాళ్లను వాడుకోవచ్చునని చెప్పారు. అవసరమైతే హైకోర్టు భవనం మొత్తాన్ని ఖాళీ చేసి ఆంధ్రప్రదేశ్ కి అప్పగిస్తామని స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నడుమ చట్టసభలు, అధికారుల విభజన జరిగిందే కానీ.. న్యాయ వ్యవస్థ మాత్రం విభజన కాలేదన్నారు. వాదలను విన్న సుప్రీంకోర్టు ఉమ్మడి హైకోర్టు, ఎపి సర్కార్ కి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా తమ అభిప్రాయాలను తెలపాలని నోటీసుల్లో పేర్కొంది. తదుపరి విచారణను రెండు వారాల వరకు కోర్టు వాయిదా వేసింది.

Related Stories: