హెచ్1బి దరఖాస్తు రుసుం పెంపు…

  * అమెరికా కార్మిక శాఖ ప్రతిపాదన * భారతీయ కంపెనీలకు మరింత దెబ్బ * స్థానిక అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్‌కు ఊతం వాషింగ్టన్ : అమెరికాలో హెచ్ 1 బి వీసాలకు దరఖాస్తుల రుసుం పెంచెందుకు రంగం సిద్ధం అయింది. దీనితో భారతీయ ఐటి కంపెనీలపై మరింత భారం పడుతుంది. అమెరికా యువతకు సాంకేతిక శిక్షణను కల్పించే అప్రెంటిస్ ప్రోగ్రాం అమలుకు నిధుల కోసం ఈ రుసుం పెంచాలని అమెరికా ప్రభుత్వం సంకల్పించింది. 2020 ఆర్థిక సంవత్సరపు […] The post హెచ్1బి దరఖాస్తు రుసుం పెంపు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

* అమెరికా కార్మిక శాఖ ప్రతిపాదన
* భారతీయ కంపెనీలకు మరింత దెబ్బ
* స్థానిక అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్‌కు ఊతం

వాషింగ్టన్ : అమెరికాలో హెచ్ 1 బి వీసాలకు దరఖాస్తుల రుసుం పెంచెందుకు రంగం సిద్ధం అయింది. దీనితో భారతీయ ఐటి కంపెనీలపై మరింత భారం పడుతుంది. అమెరికా యువతకు సాంకేతిక శిక్షణను కల్పించే అప్రెంటిస్ ప్రోగ్రాం అమలుకు నిధుల కోసం ఈ రుసుం పెంచాలని అమెరికా ప్రభుత్వం సంకల్పించింది. 2020 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌లో ఈ రుసుం పెంపుదల అంశాన్ని చేర్చినట్లు దేశ కార్మిక మంత్రి అలెగ్జాండర్ అకోస్టా చట్టసభ సభ్యులకు తెలిపారు. బారతీయ ఐటి కంపెనీలు అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను ఈ వీసాలతోనే అమెరికాకు పంపిస్తూ వస్తున్నాయి. అయితే ఈ రుసం పెంపుదలతో ఐటి కంపెనీలు ఒక్కసారిగా ఆటుపోట్లకు గురి కావాల్సి ఉంటుంది. అయితే ఈ రుసుం ఏ మేరకు పెంచుతున్నదీ? ఏఏ కేటగిరీల దరఖాస్తుదార్లకు ఎంత పెంపుదల ఉంటుందనేది కార్మిక మంత్రి తెలియచేయలేదు.

ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి అమెరికాలో 2020 వార్షిక బడ్జెట్‌లోని కీలక అంశాలను కార్మిక మంత్రి సంబంధిత చట్టసభ సభ్యుల కమిటీ ముందుంచారు. హెచ్ 1 బి వీసాల జారీకి సంబంధించి ట్రంప్ అధికార యంత్రాంగం పలు కీలక నిబంధనలను తీసుకువస్తున్న దశలో భారత్, చైనాలకు చెందిన ఐటి యువత అమెరికాలో ఉద్యోగాల ఆశలు నెరవేరేందుకు గడ్డు పరిస్థితిని ఎదుర్కోవల్సి వస్తోంది. ఫీజు రుసుం పెంపుదల ప్రతిపాదనలతో పాటు , దరఖాస్తులలోని అంశాలను కూడా సమూలంగా మార్చివేస్తున్నట్లు కార్మిక మంత్రితెలిపారు. మరింత పారదర్శకత, ఇదే సమయంలో అమెరికా ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యతను ఇస్తూ ఫారాలలో తగు మార్పులు చేర్పులు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. దీనితో వీటిలో ఏ ఏ సరికొత్త అంశాలు వస్తాయనేది ఇప్పుడు భారతీయ ఐటి కంపెనీల ముందు ప్రశ్నార్థకంగా మారింది.

హెచ్ 1 బి వీసా ప్రక్రియను కంపెనీల యాజమాన్యాలు దుర్వినియోగపర్చకుండా చేసేందుకు మౌలిక స్థాయిల్లోనే మార్పులు చేర్పులు చేపట్టనున్నట్లు కార్మిక మంత్రి తెలిపారు. ఇండియా, చైనాల నుంచి అత్యధికంగా ఐటి కంపెనీలు ఉద్యోగులను అమెరికాకు పంపించేందుకు హెచ్ 1 బి వీసాలే ఆయువుపట్టు అవుతున్నాయి. విదేశాల నుంచి వస్తున్న వారు ఉద్యోగాల విషయంలో అమెరికా వర్కర్లతో ఇప్పటి చట్టాల వెసులుబాట్లతో పోటీ పడుతున్నారని, తక్కువ వేతనాలకు సిద్ధం అవుతూ చివరికి కీలక ఉద్యోగాలలో తిష్టవేసుకుంటున్నారని, దీనితో దేశీయ ఐటి ప్రతిభకు గండి పడుతోందని అమెరికా భావిస్తోంది.

తమ యువతకు సాంకేతిక పరిజ్ఞానం విస్తృతం చేసేందుకు ట్రంప్ ఆలోచనల పరిధిలో అప్రెంటిస్ ప్రోగ్రాంను తీసుకువస్తున్నట్లు కార్మిక మంత్రి అకోస్టా చెప్పారు. అప్రెంటిస్ కార్యక్రమం కోసం భారీగా నిధులు అవసరం అవుతాయని, హెచ్1 బి వీసా దరఖాస్తుల రుసుం పెంచడం ద్వారా ఈ నిధిని కొంత మేరకు సమకూర్చుకునేందుకు వీలేర్పడుతుందని మంత్రి ఇటీవలే కాంగ్రెస్ కమిటీకి తెలియచేసుకున్నారు. ఐటి రంగంలోని అత్యున్నత స్థాయి సాంకేతిక నైపుణ్య ఉద్యోగాలకు ఇప్పటివరకూ అమెరికా కంపెనీలు ఎక్కువగా భారత్ , చైనాలకు చెందిన వారిని ఉద్యోగాలలోకి తీసుకుంటున్నాయి. అవసరం స్థాయి ఎక్కువగా ఉన్న రంగాలలో అవసరమైన ప్రతిభావంతులైన వారు స్థానికులు లేకపోవడం కీలక సమస్య అవుతోందని, దీనిని గుర్తించి ఇప్పుడు ఈ అప్రింటిస్ కార్యక్రమాన్ని కార్మిక శాఖ నిర్థారిత బడ్జెట్‌లో 160 మిలియన్ డాలర్ల అంచనాలతో రూపొందించారు.

 

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post హెచ్1బి దరఖాస్తు రుసుం పెంపు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: