‘హుస్నాబాద్ నుంచే ఎన్నికల శంఖారావం’

‘Prajala Ashirvada Sabha’ at Husnabad on Sept 7

సిద్దిపేట: జిల్లాలోని హుస్నాబాద్ సభకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. మంత్రి హరీష్‌రావు ప్రత్యక్షంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. హుస్నాబాద్ నుంచే తెలంగాణ ఎన్నికల శంఖారావం మోగనుందని సమచారం. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. గతంలో కూడా ఇక్కడి నుంచే సిఎం కెసిఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంబించిన సంగతిని గుర్తు హరీష్‌రావు చేశారు. కెసిఆర్‌కు కలిసొచ్చిన ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. కొంగర్‌కలాన్‌లో జరిగిన ప్రగతి నివేదన సభలో నాలుగున్నరేళ్ల ప్రగతిని ప్రజలకు నివేదించామని చెప్పారు. అలాగే ప్రజా ఆశీర్వాద సభలతో ఐదేళ్ల మేనిఫెస్టోను వివరించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇక అసెంబ్లీ రద్దుపై సిఎం నిర్ణయం తీసుకుంటారన్నారు.

Comments

comments