హుస్నాబాద్‌లో ఆశీర్వాద సభ

సభా ప్రాంగణానికి భూమిపూజ చేసిన మంత్రి హరీశ్‌రావు హాజరైన మంత్రి ఈటల, ఎంపి వినోద్ 50 రోజుల్లో 100 బహిరంగ సభలు : హరీశ్‌రావు మన తెలంగాణ / హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్న ‘ప్రజల ఆశీర్వాద సభ’కు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక ప్రసంగం చేయనున్న ఈ సభకు వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తు న హాజరయ్యేందుకు మంత్రులు హరీశ్‌రావు, ఈటల […]

సభా ప్రాంగణానికి భూమిపూజ చేసిన మంత్రి హరీశ్‌రావు
హాజరైన మంత్రి ఈటల, ఎంపి వినోద్
50 రోజుల్లో 100 బహిరంగ సభలు : హరీశ్‌రావు

మన తెలంగాణ / హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్న ‘ప్రజల ఆశీర్వాద సభ’కు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక ప్రసంగం చేయనున్న ఈ సభకు వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తు న హాజరయ్యేందుకు మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, ఎంపి వినోద్‌కుమార్‌లు ఏర్పాట్లు చేస్తున్నారు. హుస్నాబాద్‌లో మకాం వేసి సభా వేదిక ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. యాభై రోజుల్లో వంద సభలను నిర్వహిస్తామని, సగటున ప్రతీరోజు రెండు సభల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సభను విజయవంతం చేయడం కోసం బుధ, గురువారాల్లో సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లోని మండల టిఆర్‌ఎస్ కార్యకర్తలతో సమావేశాలను నిర్వహించనున్నామని, హుస్నాబాద్ సభకు 65 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని, ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని హరీశ్‌రావు తెలిపారు. మండలాలవారీగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు రావడానికి రూట్‌మ్యాప్ ఖరారవుతోందని, మోటార్‌సైకిల్ యాత్రలతో పాటు పాదయాత్రలకు కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. వాతావరణ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్నం రెండు గంటల నుంచే సభ ప్రారంభమయ్యేలా ప్రణాళిక రూపొందించినట్లు హరీశ్‌రావు మీడియాకు వివరించారు.

సభా ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక ఆర్‌టిసి డిపో పక్కన ఉన్న గ్రౌండ్‌ను బహిరంగసభ కోసం ఎంపిక చేసి వెంటనే ఏర్పాట్లను మొదలుపెట్టారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించి సభ నిర్వహణ గురించి చర్చించారు. నియోజకవర్గ పరిధిలోని హుస్నాబాద్ టౌన్, హుస్నాబాద్ మండలం నుండి 15 వేలు, ఎల్కతుర్తి నుండి 6 వేలు, భీమదేవరపల్లి నుండి 10 వేలు, అక్కన్నపేట్ మండలం నుండి 10 వేలు, కోహెడ మండలం నుండి 10 వేలు, సైదాపూర్ మండలం నుండి 10 వేలు, చిగురుమామిడి మండలం నుండి 6 వేల మంది చొప్పున సభకు తరలించే విధంగా స్థానిక పార్టీ నాయకత్వానికి సూచనలు చేశారు. చిగురుమామిడి మండలానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, సైదాపూర్ మండలానికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, కోహెడకు మానకొండూర్ ఎంఎల్‌ఏ రసమయి బాల కిషన్, అక్కన్నపేట్ కు ఎంఎల్‌సి నారదాసు లక్ష్మణ్ రావు, భీమదేవరపల్లి కి ఎంఎల్‌ఏ పుట్ట మధు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పన్యాల భూపతి రెడ్డి, ఎల్కతుర్తి కి మెట్‌పల్లి ఎంఎల్‌ఏ విద్యాసాగర్ రావు, హుస్నాబాద్ టౌన్ రూరల్‌కు నీటిపారుదల మార్కెటింగ్ శాఖామంత్రి హరీష్ రావు హరీష్ రావు, కరీంనగర్ ఎంపి వినోద్ కుమార్, ఎంఎల్‌సి పాతూరి సుధాకర్ రెడ్డిలు ఇంఛార్జిలుగా వ్యవహరించనున్నారు. బుధ, గురువారాల్లో ఆయా మండలాల్లో పార్టీ సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ వెల్లడించారు.

Comments

comments

Related Stories: