హీరోయిన్ ను పెళ్లాడబోతున్న నితిన్…?

Nithin to get married with young actress?

హైదరాబాద్:  టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ జాబితా చాలా పెద్దదిగానే ఉంది. ఈ లిస్ట్ లో మొదట ఉన్నది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆ తరువాత గుర్తొచ్చేది రామ్,  నితిన్. అయితే నితిన్ గురించి ప్రస్తుతం టాలీవుడ్ ఓ పుకారు షికారు చేస్తుంది. ఆయనతో తనతో కలిసి నటించిన ఓ హీరోయిన్ తో పీకలోతు ప్రేమలో ఉన్నాడని పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక తన కెరీర్ ప్రారంభంలోనే సక్సెస్ చూసిన నితిన్ ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న టైంలో విక్రమ్ కుమార్ ‘ఇష్క్’ సినిమాతో మళ్లీ విజయాల బాట పట్టించాడు. ఈ మూవీ తర్వాత చేసిన గుండెజారీ గల్లంతైందే, హార్ట్ ఎటాక్, అఆ మూవీలు వరుసగా విజయాలు సాధించాయి. అప్పుటి నుండి పర్లేదు అనిపించుకుంటున్న సమయంలో మరోసారి ‘లై’, ‘చల్ మోహన రంగ’, తాజాగా ‘శ్రీ‌నివాస క‌ళ్యాణం’  కూడా ఆయనకు నిరాశకు గురిచేసింది.

Nithin to get married with young actress?

ఇదిలాఉంటే ‘శ్రీ‌నివాస క‌ళ్యాణం’ సినిమా తర్వాత నితిన్ పెళ్లి చేసుకుంటాడా..? లేదా..? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ మూవీ ముందు.. ఆ తర్వాత.. నితిన్ ప్ర‌వర్త‌న‌లో చాలా మార్పు వ‌చ్చింద‌ంటున్నారు. ఈ చిత్రానికి ముందు నితిన్ ప్రేమలో ఉన్నాడని, ఈ సినిమా తర్వాత పెళ్లి చేసుకుంటాడని టాలీవుడ్ జనాల బోగట్ట. త‌న‌తో వ‌రుస‌గా రెండు సినిమాల్లో న‌టించిన మేఘ ఆకాష్‌తో ల‌వ్‌లో ఉన్నాడ‌ని చెప్పుకుంటున్నారు. అతి తొంద‌ర్లోనే ఈ జంట పెళ్లిపీటలెక్కనున్నారని సోషల్ మీడియాలో క‌థ‌నాలు వస్తున్నాయి. కాగా, మేఘ ఆకాష్‌ తన ఇంట్లో నితిన్ తో పెళ్లి గురించి ప్రస్తావించారట. దీనికి ఆమె ఇంట్లోవాళ్లు ఓ ఏడాది పాటు ఆగాక ఇంకా ప్రేమ‌లోనే ఉంటే పెళ్లికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారట. దీంతో ఈ జంటపై ఇప్పుడు గాసిప్స్ ఊపందుకున్నాయి.

Comments

comments