హిమాచల్‌లో ఘోర అగ్నిప్రమాదం…!

Fire Accident in Himachal Pradesh

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ మండిలోని నెర్‌చౌక్ ప్రాంతంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ భవనంలో చెలరేగిన మంటల్లో ఐదుగురు సజీవదహనం అయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాదస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు ఘటనాస్థలిలో సహాయచర్యలు చేపట్టాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.