హార్దిక్ పాండ్యా కొత్త లవర్..?

Hardik

ముంబయి: టీమిండియా ఆల్‌రౌండర్ హర్దిక్ పాండ్యాపై ఇటీవల బాలీవుడ్‌లో ఓ రూమర్ తెగ హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ భామ పరిణితిచోప్రాతో పాండ్యా డేటింగ్‌లో ఉన్నాడనేది ఈ రూమర్ సారాంశం. అయితే దీనిపై పరిణితి వెంటనే స్పందించి అలాంటిదేమి లేదని స్పష్టం చేసింది. తాజాగా పాండ్యాపై బాలీవుడ్‌లో మరో పుకారు వైరల్ అవుతోంది. పాండ్యా స్వీడన్ భామ ఎల్లీతో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ కోడైకూస్తోంది. ఇటీవల జరిగిన అన్నయ్య కృనాల్ పాండ్యా వివాహ వేదికపై పాండ్యాతో కలిసి ఎల్లీ హడావిడి చేయడం దీనికి ఊతమిస్తోంది. దీంతో వీరిద్దరూ ప్రస్తుతం ప్రేమలో మునిగి తేలుతున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం.