హాట్..హాట్‌గా..హుజూరాబాద్ మున్సిపల్ రాజకీయాలు

వైరల్ మారిన ‘మున్సిపల్ చైర్మన్ రాజీనామా’ అంశం అధికార పార్టీలో తారస్థాయికి చేరుకున్న విభేదాలు మంత్రి వద్దకు చేరిన మున్సిపల్ రాజకీయ పంచాయతీ  “ హుజూరాబాద్ పట్టణంలో మున్సిపల్ రాజకీయాలు హాట్ టాఫిక్‌గా మారాయి. అవిశ్వాస తీర్మాణంపై మంత్రి ఈటల రాజేందర్ మౌనం వహిస్తుండటంతో హుజూరాబాద్ రాజకీయాలు హాట్ టాఫిక్‌గా మారాయి. మున్సిపల్ రాజీనామా సస్పెన్స్‌లా మారుతుండటంతో రోజురోజూకి రాజకీయ పరిణమాలు చోటు చేసుకుంటున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు చైర్మన్, […]

వైరల్ మారిన ‘మున్సిపల్ చైర్మన్ రాజీనామా’ అంశం
అధికార పార్టీలో తారస్థాయికి చేరుకున్న విభేదాలు
మంత్రి వద్దకు చేరిన మున్సిపల్ రాజకీయ పంచాయతీ

 “ హుజూరాబాద్ పట్టణంలో మున్సిపల్ రాజకీయాలు హాట్ టాఫిక్‌గా మారాయి. అవిశ్వాస తీర్మాణంపై మంత్రి ఈటల రాజేందర్ మౌనం వహిస్తుండటంతో హుజూరాబాద్ రాజకీయాలు హాట్ టాఫిక్‌గా మారాయి. మున్సిపల్ రాజీనామా సస్పెన్స్‌లా మారుతుండటంతో రోజురోజూకి రాజకీయ పరిణమాలు చోటు చేసుకుంటున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు చైర్మన్, కౌన్సిలర్‌ల మద్య స్నేహా ఉండగా వారి మధ్య ఇప్పుడు దూరం పెరిగిపోయి మాటల యుద్దం పెరిగిపోయింది. ఒకప్పుడు ప్రతి సమావేశంలో కలిసిమెలిసి వారి మద్య ఉన్న ఐక్యతను చూపే మున్సిపల్ పాలకవర్గం వారి మద్యలో ఇప్పుడు గొడవలు తారస్థాయికి చేరుకోవడంతో జిల్లా వ్యాప్తంగా హుజూరాబాద్ మున్సిపల్ రాజకీయాలు హాట్..హాట్‌గా మారాయి. హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్ రాజీనామా చేస్తారా లేదా అనే విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న దానిపై మన తెలంగాణ ప్రత్యేక కథనం. 

మనతెలంగాణ/హుజూరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోనే హుజూరాబాద్ ఒక ప్రత్యేక స్థానం ఉంది.సాక్షాత్తు రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా ప్రాతినిధ్యం వహించే ప్రాంతం కావడంతో రాష్ట్ర నాయకుల చూపులన్ని దానిపైనే ఉన్నాయి. అంతేకాకుండా మే 10న రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బందు పథకాన్ని హుజూరాబాద్ నుంచే శ్రీకారం చుట్టడంతో దీన్ని ప్రతిష్ట మరింత పెరిగిపోయింది. అలాంటి ప్రత్యేక గుర్తింపు ఉన్నప్రాంతం ఇప్పుడు రాజకీయ పరిణమలతో వేడెక్కుతుంది. పట్టణంలో 20 వార్డులు ఉన్నాయి. 2014 జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వడ్లూరి విజయ్‌కుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది ఆ తర్వాత పట్టణాభివృద్ది కోసం టీఆర్‌ఎస్ పార్టీలో మంత్రి ఈటలరాజేందర్ సమక్షంలో చేరారు.చైర్మన్ ఎన్నికపై రాజకీయాలు రసవత్తకరంగామారినప్పుడు మెజార్టీ కౌన్సిలర్లు అప్పుడు వడ్లూరి విజయ్‌కుమార్ వైపు ఓటు వేయడంతో మంత్రి ఈటల రాజేందర్ వడ్లూరి విజయ్‌కుమార్‌ను చైర్మన్‌గా ప్రకటించగా ఇప్పుడు మంత్రి ఈటల చైర్మన్‌ను తొలగించేందుకు సంసిద్దం వ్యక్తం చేస్తున్నారు.

వైరల్ మారిన మున్సిపల్ చైర్మన్ రాజీనామా
పట్టణంలో మంత్రి ఈటల రాజేందర్ పేరిటా నిరుపేద ప్రజలకు కట్టించి ఇచ్చిన షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీగా అవినీతి చోటు చేసుకున్నాయనే కథనాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.కౌన్సిలర్లు, చైర్మన్ షాపింగ్ కాంప్లెక్స్‌ల కేటాయింపులో డబ్బులు దండుకుంటున్నట్లు అప్పట్లో ప్రచారం భారీగా జరిగిందనే పత్రికల్లో కథనాలు పెనుదుమారం లేపుతాయి. అంతేకాకుండా మంత్రి ఈటలరాజేందర్ కూడా అందులో వాటా ఉన్నట్లు ప్రచారం తారస్థాయిలో జరగడంతో మంత్రి ఈ విషయంపై మున్సిపల్ పాలకవర్గంపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. అంతేకాకుండా హుజూరాబాద్ నుంచి జమ్మికుంట వరకు చేపట్టిన ఫోర్‌వే పనుల్లో భాగంగా పట్టణంలో జమ్మికుంట రోడ్డు పక్కనే ఉన్న షాపులను తొలగించేందుకు నోటీసులు జారీ చేయగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.
పార్టీకి చెడ్డ పేరుతో వస్తుందంటూ మంత్రి ఈటల మందలించిన సందర్భాలు కూడా కోకోల్లుగా ఉన్నాయి. చేయని పనులకు కూడా బిల్లుల చెల్లింపులు,భూఆక్రమణ వంటి పనులు హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్‌కు సమస్యలు తెచ్చిపెట్టినట్లు ప్రచారం తారస్థాయిలో జరుగుతుంది. అభివృద్ది పనుల పంపకాల్లో, బిల్లుల చెల్లింపుల్లో గొడవలు రావడంతో కౌన్సిలర్లందరూ కలిసి అవిశ్వాస తీర్మాణానికి సిద్దమైనట్లు పట్టణంలో ప్రచారం జోరుగా జరుగుతుంది. కౌన్సిల్లరే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి తుతూ మంత్రంగా పనులు చేసి డబ్బులు దండుకున్నారంటూ ప్రజలు బహుబటంగాఆరోపిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో వార్డు అభివృద్దికి కృషి చేసే కౌన్సిలర్‌ను మాత్రమే ఎంచుకుంటామని పట్టణ వాసులు చర్చించుకుంటున్నారు.

మంత్రి వద్దకు చేరిన మున్సిపల్ రాజకీయ పంచాయితీ
మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానంతో కౌన్సిలర్లు మంత్రి ఈటల రాజేందర్‌ను కలుసుకున్నారు. కాగా మున్సిపల్ చైర్మన్‌తో రాజీనామా చేయించడంతో పట్టణ పరిస్థితులు ఏవిధంగామారుతాయో అన్నదానిపై మంత్రి ఈటల రాజేందర్ ఆలోచిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజీనామా జరిగితే ఎన్నికల్లో పార్టీ భవితవ్యం ఎలా ఉండబోతుందో అర్థంకానీ పరిస్థితి నెలకొనడంతో రాజీనామా విషయంపై పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారనే విషయం తెలుస్తోంది. కాగా మున్సిపల్ చైర్మన్ రాజీనామా జరిగితే తర్వాత చైర్మన్ ఎవరూ అన్నదానిపై ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎవరికి వారే మంత్రిని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో హుజూరాబాద్ మున్సిపల్ రాజకీయాలు రసవత్తకరంగా మారడంపై పలువురుపలు రకాలుగా చర్చించుకోవడం గమనార్హం.

Related Stories: