హరిత జాతరకు కదిలిన జనం

Special program for spilling in the hills and in the mounds

జిల్లాలో 2.24కోట్ల విత్తన బంతుల తయారి
కొండలు, గుట్టల్లో వెదజల్లేందుకు ప్రత్యేక కార్యక్రమం
పక్షం రోజుల పాటు సాగనున్న బాంబింగ్
సహజ అటవీ సంపద పెంపొందించడమే లక్షం

మనతెలంగాణ/పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో సహజ అటవీ సంపద పెంపొందించడమే లక్షంగా కలెక్టర్ శ్రీదేవసేన ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న విత్తన బంతుల హరితహారానికి గురువారం నుంచి శ్రీకారం చుట్టారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాలు, ప్రజలు ఈ హరితహారాన్ని విజయవంతం చేయడానికి గుట్టలు, కొండ ల బాట పట్టడంతో అటవీ ప్రాంతాలన్నీ జన జాతరను మ రిపిస్తున్నాయి జిల్లాలో ఉన్న 14శాతం అడవిని పచ్చగా ఉంచడంతో పాటు, మరింత వృ్దద్ధి చేసేందుకు విత్తన బంతు ల హరితహారాన్ని రూపొందించారు. మొక్కలను భూ మిపై నాటడం కంటె విత్తన బంతులను గుట్టలు, కొండలలో వేయడం ద్వారా మొలిచిన మొక్కలలో ఎక్కువ శాతం ప్ర కృతి సిద్ధంగా రక్షించబడి వృక్షాలుగా మారనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో విత్తన బంతులను తయారు చేసి, బాంబింగ్ చేయడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. గురువారం నుండి పక్షం రోజుల పాటు జరుగ ను న్న విత్తన బంతుల బాంబింగ్ కోసం జిల్లాలోని 202 గ్రామ పంచాయితీల్లో మహిళా సంఘాలు,విద్యార్థు లు,ప్రజలు యుద్ధ ప్రాతిపదికన 2 కోట్ల 24 లక్షల విత్తన బంతులను తయారు చేశారు. ఈ విత్తన బంతులను ప్రత్యేకంగా గుర్తించిన కొండలు,గుట్టలలో వెదజల్లేందుకు గాను జిల్లాలో ఉన్న 14 మండలాలతో పాటు 202 గ్రామ పంచాయితీలకు ప్రత్యేక అధికారులను నియమించారు.
ప్రతి రోజు గ్రామంలో గుర్తించిన ప్రాంతాలలో కనీసం 10వేల విత్తన బంతులను వెదజల్లాలని లక్షంగా నిర్ణయించడంతో అదికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు,ప్రజల సహకారంతో ముమ్మరంగా బాంబింగ్ కార్యక్రమాన్ని ని ర్వహిస్తున్నారు.

Comments

comments