హరిత గణపతులు

రాష్ట్ర వ్యాప్తంగా మట్టి విగ్రహాల పంపిణీకి రంగం సిద్ధం
కాలుష్యమండలి ఆధ్వర్యంలో 1.95 లక్షల ప్రతిమలు

Vinayka

మన తెలంగాణ/ హైదరాబాద్ : కాలుష్య నియంత్రణలో భాగంగా మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, దీనికోసం మట్టి విగ్రహాలను తయారీ చేయించి పంపిణీ చేయాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయించింది. అందులో భాగంగా ఈ సంవత్స రం 1.95 లక్షలకు పైగా విగ్రహాలను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయనుంది. పర్యావరాణానికి మేలు చేసే మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలని గణేశ్ మండపాల నిర్వాహకులకు సూచించింది. విగ్రహాలకు సహజసిద్ధమైన  రంగులనే వినియోగించాలని సూచించింది. ఈ రంగులను రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. చెరువులు, కుంటల్లో గణేశులను నిమజ్జనం చేసినప్పుడు నీటికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటోంది. జిహెచ్‌ఎంసి అధికారులతో ఇప్పటికే సమావేశం నిర్వహించింది.

పలు ప్రాంతాల్లో 23 ప్రత్యేక కొలనులు

లేక్‌సిటీగా పేరుగాంచిన నగరంలోని చెరువులు, కాలుష్యకోరల్లో చిక్కిపోకుండా ఉంచడంతో పాటు శుభ్రమైన నీటిలో గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు 23 ప్రత్యేక కొలనులను జిహెచ్‌ఎంసి నిర్మించింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్, ఇతర రసాయన పదార్థాలతో తయారు చేసే వినాయక విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేయడం ద్వారా నీరు కలుషితమవుతోందన్న టిఎస్‌పిసిబి సూచనల మేరకు జిహెచ్‌ఎంసి ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్కో నిమజ్జన కొలనులో 5 వేల విగ్రహాలను నిమజ్జనం చేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మల్క చెరువు, నల్లగండ్లలోని నల్లగండ్ల చెరువు, మన్సూరాబాద్‌లోని పెద్ద చెరువు, సికింద్రాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ లేక్, నెక్నాంపూర్‌లోని పెద్ద చెరువు, సూరారం లోని లింగం చెరువు, అల్వాల్‌లోని కొత్త చెరువు, ఉప్పల్‌లోని నల్లచెరువు, రాజేంద్రనగర్‌లోని పత్తికుంట, హస్మత్‌పేటలోని బోయిన చెరువు, మియాపూర్‌లోని గురునాథరావు, లింగంపల్లిలోని గోపీ చెరువు, రామచంద్రాపురంలోని రాయసముద్రం, హఫీజ్‌పేటలోని కైదమ్మకుంట, రాయదుర్గంలోని దుర్గం చెరువుల్లో కొలనులు పూర్తయినట్టు అధికారులు పేర్కొంటున్నారు.

8 అంగుళాల ప్రతిమలు సిద్ధం

జల వనరులు, పర్యావరణం కలుషితం కాకుండా కొన్ని సంవత్సరాలుగా టిఎస్‌పిసిబీ పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రాష్ట్రంలోని పలు పట్టణాలకు, జీహెచ్‌ఎంసీకి మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తోంది. దీనికోసం 8 అంగుళాల ప్రతిమలను సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా టిఎస్‌పిసిబీ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా టిఎస్‌పిసిబీ విగ్రహాలు లభించే ప్రదేశాలు
1.గణేశ్ టెంపుల్ (వైఎంసీఏ, సికింద్రాబాద్)
2.అమీర్‌పేట్ (సత్యం, థియేటర్) హైదరాబాద్
3.కోఠి పక్కన ఉమెన్స్ కాలేజీ, హైదరాబాద్
4.ప్రభుత్వ ఆస్పత్రి, మహబూబ్‌నగర్
5.మెహిదీపట్నం, రైతుబజార్ బస్టాప్, హైదరాబాద్
6.ఉప్పల్ క్రాస్‌రోడ్, పోలీస్‌స్టేషన్ పక్కన
7.ఎల్.బి.నగర్
8.నాగోల్ చౌరస్తా
9.కూకట్‌పల్లి (జేఎన్‌టీయూ పక్కన)
10.జీడిమెట్ల, రైతుబజార్
11.బాలానగర్, బివి ఆస్పత్రి పక్కన
12.సుచిత్రా క్రాస్‌రోడ్డు పక్కన
13.రాంచంద్రాపురం, టిఎస్‌పిసిబీ జోనల్ ఆఫీసు పక్కన
14.కెన్నడీ ఇంటర్నేషనల్ స్కూల్, బొల్లారం
15.ఎంపీపీ ఆఫీసు, జిన్నారం
16.సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం పక్కన
17.సంగారెడ్డి టిఎస్‌పిసిబీ రీజనల్ ఆఫీసు పక్కన
18.గణేశ్ టెంపుల్, రుద్రారం, సంగారెడ్డి
19. క్లాక్‌టవర్, నల్లగొండ
20.చౌటుప్పల్, ఎమ్మార్వో ఆఫీసు, యాదాద్రి, భువనగిరి జిల్లా
21.సూర్యాపేట, కలెక్టర్ ఆఫీసు పక్కన
22.సుభాష్‌నగర్, ఎస్‌బీహెచ్ పక్కన
23.నిజామాబాద్, దుబ్బా చౌరస్తా
24.కరీంనగర్ కలెక్టరేట్
25.పెద్దపల్లి కలెక్టరేట్
26.గోదావరిఖని మున్సిపల్ ఆఫీసు
27.ఎన్టీపీసీ రామగుండం
28.హన్మకొండ పెట్రోల్ బంక్
29.వరంగల్, సుభేదారి, కలెక్టరేట్ ఆఫీసు పక్కన
30.అలంకార్ థియేటర్, వరంగల్
31.జనగాం బస్‌స్టేషన్
32.కొత్తగూడెం పోస్టాఫీసు
33.ఖమ్మం రైతుబజార్ పక్కన
34.పాల్వంచ బస్టాండ్ పక్కన
35.కొత్తగూడెం రైల్వేస్టేషన్
జీహెచ్‌ఎంసీ పరిధిలో టిఎస్‌పిసిబీ ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్న విగ్రహాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
1.ఎల్.బినగర్ జోన్ పరిధిలో 17,000 వేల విగ్రహాలను ఐదు సర్కిళ్లుగా విభజించి పంపిణీ చేస్తున్నారు.
1.కాప్రా సర్కిల్, 2.ఉప్పల్, 3.హయత్‌నగర్, 4.ఎల్‌బీనగర్ సర్కిల్, 5.సరూర్‌నగర్ సర్కిల్ ప్రాంతాలు
2.చార్మినార్ జోన్ పరిధిలో 16,000 విగ్రహాలను ఆరు సర్కిళ్లుగా విభజించి పంపిణీ చేస్తున్నారు.
1.మలక్‌పేట్ 6వ సర్కిల్.. 2.సంతోష్‌నగర్ 7వ సర్కిల్, 3.చాంద్రాయణగుట్ట 8వ సర్కిల్, 4.చార్మినార్ 9వ సర్కిల్, 5.ఫలక్‌నుమా 10 సర్కిల్, 6.రాజేంద్రనగర్ 11వ సర్కిల్.
3.ఖైరతాబాద్ జోన్ పరిధిలో 17,000 వేల విగ్రహాలను 4సర్కిళ్లుగా విభజించి పంపిణీ చేస్తున్నారు.
1.బల్కంపేట వార్డు ఆఫీసు, 2.ఖైరతాబాద్ వార్డు ఆఫీసు, 3.కుందన్‌బాగ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కాలనీ, 4.కార్పొరేటర్స్
4.కూకట్‌పల్లి జోన్ పరిధిలో 16,000 వేల విగ్రహాలను 5 సర్కిళ్లుగా విభజించి పంపిణీ చేస్తున్నారు.
1.మూసాపేట సర్కిల్, 2.కూకట్‌పల్లి సర్కిల్, 3.కుత్భుల్లాపూర్, 4.గాజులరామారం, అల్వాల్ సర్కిల్
5.సికి్రందాబాద్ జోన్‌లో 17,000 వేల విగ్రహాలను 2సర్కిళ్లుగా విభజించి పంపిణీ చేయనున్నారు.
1.బేగంపేట, సికింద్రాబాద్ సర్కిల్
6.శేరిలింగంపల్లి జోన్ పరిధిలో 16,000 వేల విగ్రహాలను 4సర్కిళ్లుగా విభజించి పంపిణీ చేస్తున్నారు.
1.పటాన్‌చెరు,2.శేరిలింగంపల్లి, 3.చందానగర్ (పీజేఆర్ స్టేడియం), 4.యూసుఫ్‌గూడ