హరితహారం మానుకోటకు మణిహారం

మన తెలంగాణ/మహబూబాబాద్ ప్రతినిథి: హరితహారం మానుకోటకు మణిహారం కావాలని అందుకు విరివిగా మెక్కలు నాటి కార్యక్రమం ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి ఎంపిడిఓ, ఎపిఓ,ఈజిఎస్ సిబ్బందితో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరితహారం, స్వచ్ఛభారత్ మిషన్, ఎన్‌ఆర్‌ఇజిఎస్ పనుల ప్రగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 4వ విడత హరితహారం ఈ సారి ఉద్యమంలా సాగాలని తెలిపారు. 98లక్షల […]

మన తెలంగాణ/మహబూబాబాద్ ప్రతినిథి: హరితహారం మానుకోటకు మణిహారం కావాలని అందుకు విరివిగా మెక్కలు నాటి కార్యక్రమం ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి ఎంపిడిఓ, ఎపిఓ,ఈజిఎస్ సిబ్బందితో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరితహారం, స్వచ్ఛభారత్ మిషన్, ఎన్‌ఆర్‌ఇజిఎస్ పనుల ప్రగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 4వ విడత హరితహారం ఈ సారి ఉద్యమంలా సాగాలని తెలిపారు. 98లక్షల మొక్కలు నాటే లక్షాన్ని ప్రణాళికా బద్దంగా సాధించాలన్నారు. జిల్లాలో ఈ విడత 96లక్షల మొక్కలు కాగా 32లక్షల 37వేల మొక్కలు నేటి వరకూ నాటడం జరిగిందని, వచ్చే వారానికి వేగం పుంజుకోవాలని ఆయన ఆదేశించారు. మొక్కలు నాటడంతోపాటు వాటి మనుగడకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి మండలంలోని 4 నుండి 5 ప్రదేశాలు బ్లాక్ ప్లాంటేషన్ చేయడం గుర్తించి సిద్దంగా ఉండాలని అన్నారు. నాటిన మొక్కలను రక్షించేందుకు ఎన్‌ఆర్‌ఇజిఎస్ క్రింద వాచ్ అండ్ వాడ్‌ను నియమించాలన్నారు. రాష్ట్రంలో మొక్కలు నాటడంలో జిల్లా 19వ స్థానంలో ఉందని అగ్రగామిగా చేయడానికి అధికారులు సంయుక్తంగా కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంలో భాగమైన స్వచ్ స్వరేక్షస్ గ్రామీన్ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లాను మొదటి స్థానంలో నిలపడం కోసం అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు.

నిర్మించిన మరుగుదొడ్ల నిర్మాణాల వాడకం వాటి పరిశుభ్రత, గ్రామాల్లోని అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వాటి వాడకం, పరిసరాల పరిశుభ్రత, ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలపై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు గ్రామైక్య సంఘాలు, స్వయం సహాయ సంఘాలు, ప్రజా ప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని కలెక్టర్ అధికారులకు చెప్పారు. అక్టోబర్ 2 నాటికి జిల్లాను మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్ క్రింద డంపింగ్ యార్డు, కిచెన్ షెడ్, ఇంకుడు గుంతలు, తదితర అంశాలపై నిర్ధేశించిన లక్షాలను గడువులోగా సాధించాలని దీనికి సంబంధిత ఎంపిడిఓలు ప్రత్యేక చొరవ చూఏపాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అటవీ శాఖ అధికారి కిష్టగౌడ్, జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారి గణేష్, మండల ప్రత్యేక అధికారులు, అన్ని మండలాల ఎంపిడిఓలు, ఎపిఓలు, ఎస్‌ఏలు, ఫీల్డ్ అసిస్టెంట్‌లు, టెక్నికల్ అసిస్టెంట్‌లు, ఈఓపిఆర్‌డిలు, పంచాయితీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: