హరితహారం ఉద్యమంలా చేపట్టాలి

మన తెలంగాణ/కామారెడ్డి:  హరితహారాన్ని ప్రజా కార్యక్రమం గా నిర్వహించాలని, అన్ని వర్గాల ప్రజలు, ప్రతినిధులు భాగస్వాములు అయ్యేలా చూడాలని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. కామారెడ్డి ఆర్‌డివో కార్యాలయంలో ఏర్పాటైన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  హరితహారంలో ఎంపిక చెసిన ప్రదేశాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. నర్సరీ డైరెక్టరీ ద్వారా ఏ గ్రామానికి ఏ మొక్కలు పంపుతున్నామో సమాచారాన్ని పొందుపరచాలన్నారు. నాల్గవ విడత హరితహారంలో ఆరు నుంచి పదవ తరగతి విద్యార్థులచే […]

మన తెలంగాణ/కామారెడ్డి:  హరితహారాన్ని ప్రజా కార్యక్రమం గా నిర్వహించాలని, అన్ని వర్గాల ప్రజలు, ప్రతినిధులు భాగస్వాములు అయ్యేలా చూడాలని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. కామారెడ్డి ఆర్‌డివో కార్యాలయంలో ఏర్పాటైన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  హరితహారంలో ఎంపిక చెసిన ప్రదేశాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. నర్సరీ డైరెక్టరీ ద్వారా ఏ గ్రామానికి ఏ మొక్కలు పంపుతున్నామో సమాచారాన్ని పొందుపరచాలన్నారు. నాల్గవ విడత హరితహారంలో ఆరు నుంచి పదవ తరగతి విద్యార్థులచే ఆరు మొక్కలను నాటింపజేయాలన్నారు. గతంలో ఎండిపోయిన మొక్కల స్థానంలో మొక్కలను నాటాలని కలెక్టర్ చెప్పారు. ప్రతి గ్రామంలో ఒక నర్సరీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉపాధి హమీ ద్వారా వారంలో ఒక రోజు క్రిటికల్ వాటర్ డేను పాటించాలన్నారు. గ్రామ పంచాయతీ వారిగా గుర్తించిన మొక్కలను ప్రదేశాలను అప్‌లోడ్ చేయాలన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో తిరుగుతున్న కోతులను తిరిగి అడవిలోకి పంపే చర్యలు తీసుకోవాలన్నారు. హరితహారంలో భాగంగా రాశి వనాలను అభివృద్ధి చేసి ప్రజలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లకు ఇరువైపులా గ్రామాలకు అటువైపు ఇటువైపు మొక్కలు నాటాలన్నారు. మున్సిపాలిటీలో ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటాలన్నారు. పట్టణాలలో గ్రీన్‌జోన్ పార్క్ ఆక్సిజన్ పార్కులుగా రూ పొందించాలన్నారు.

ప్రతి గ్రామంలో ఐదు ప్రదేశాలలో పార్కులు అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. హరితహారం అంశంపై కవి సమ్మేలనం ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేటు సంస్థల వ్యక్తులు మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కల పెంపకాన్ని పెద్ద ఎత్తున సామాజిక ఉద్యమంలా చేపట్టాడానికి ప్రభుత్వ సంస్థలు పాఠశాలలు, కళశాలలు పరిశ్రమలు ముందంజలో ఉండాలన్నారు. మొక్కల పెంపకాన్ని జిల్లాలో వినూత్నంగా చేపట్టాలన్నారు. ధరణి వెబ్‌సైట్‌పై ముఖ్యమంత్రి కార్యాలయ సెక్రటరీ  స్మితా సభర్వాల్ మాట్లాడుతూ తహసీల్దార్‌లు డిజిటల్ సంతకాలను మండలాల వారీగా వేగవం తం చేయాలన్నారు. కామారెడ్డి జిల్లాలో 132 లక్షల మొక్కలను 136 నర్సరీల ద్వారా నాటడానికి సిద్దంగా ఉన్నామని జిల్లా అధికారులు చెప్పారు. 526 గ్రామ పంచాయతీల్లో మొక్కల గుంతలను గుర్తించాలని శిక్షణ ఇచ్చామన్నారు. జిల్లా అధికారులు హరితహారంలో చేయాల్సిన విధులను చర్యలను సూచించారు. వీడియో కాన్ఫరెన్సూలో ఆర్డివోలు శ్రీను, రాజేశ్వర్, దేవెందర్ రెడ్డి, పిడి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి వసంత, సిపివో శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: