హరికృష్ణ తీరని కోరిక ఇదే…

హైదరాబాద్: సినీ నటుడు, మాజీ ఎంపి నందమూరి హరికృష్ణ నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన చివరి లేఖలో అభిమానులకు చెప్పిన మాటలు హరికృష్ణ దాతృత్వాన్ని తెలియజేస్తున్నాయి. పుట్టిన రోజు(సెప్టెంబర్ 2న)నాడు ఆర్భాటాలకు పోకుండా అవే డబ్బులను ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళ సహాయనిధికి పంపించాలని అభిమానులను కోరారు. అలా తన పెద్ద మనుసును చాటుకున్నారు. అయితే, తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది. ఆయన […]

హైదరాబాద్: సినీ నటుడు, మాజీ ఎంపి నందమూరి హరికృష్ణ నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన చివరి లేఖలో అభిమానులకు చెప్పిన మాటలు హరికృష్ణ దాతృత్వాన్ని తెలియజేస్తున్నాయి. పుట్టిన రోజు(సెప్టెంబర్ 2న)నాడు ఆర్భాటాలకు పోకుండా అవే డబ్బులను ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళ సహాయనిధికి పంపించాలని అభిమానులను కోరారు. అలా తన పెద్ద మనుసును చాటుకున్నారు. అయితే, తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది. ఆయన తీరని కోరిక ఒకటి మిగిలిపోయిందనేది ఈ వార్త సారాంశం. ఆయన పలు చిత్రాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. వైవిఎస్ చౌదరితో కలిసి చేసిన లహరి లహరి లహరిలో, సీతరామరాజు, సీతయ్య వంటి చిత్రాలు హరికృష్ణ నటవిశ్వరూపాన్ని చూపాయి. చివరిగా ఆయన కృష్ణతో కలసి ‘శ్రావణమాసం’ చిత్రంలో నటించారు. ఆ తరువాత పలువురు దర్శకులు హరికృష్ణను తమ చిత్రాల్లో నటించాలని సంప్రదించినా, ఆయన మాత్రం సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చారట. దానికి కారణం… మళ్లీ సినిమా అంటూ చేస్తే తన కుమారులు కల్యాణ్ రామ్, తారక్ లు కలసి నటించే మూవీలో మాత్రమే నటిస్తానని చెప్పేవారట. కానీ, ఆయన కోరిక తీరకుండానే ఎవరికీ అందనంత దూరానికి వెళ్లిపోయారు.

Comments

comments

Related Stories: