హజ్ యాత్రలో 20లక్షల మంది ముస్లింలు

Haj Yatra 2018: 20 Lakhs Muslims will Visit Mecca

మక్కా: భారత్‌తో పాటుగా ప్రపంచం నలుమూలలనుంచి వచ్చిన 20లక్షల మంది ముస్లింలు ఆదివారం ఈ ఏడాది హజ్‌యాత్రను ప్రారంభించారు. మక్కాలోకి కాబా చుట్టూ ఏడుపార్లు అప్రదక్షిణంగా తిరగడంతో అయిదు రోజుల పాటుసాగే హజ్ యాత్ర ప్రారంభమయింది. జీవితంలో ఒక్కసారయినా మక్కాను సందర్శించాలని ప్రతి ముస్లిం కోరుకుంటాడు. కాబా చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ముస్లింలు ముస్లిం ప్రవక్త ఇబ్రహీం భార్య హగర్ నడిచిన రెండు కొండల మధ్య దారిగుండా నడిచి మక్కా మసీదును చేరుకుంటారు. మక్కాకు వెళ్లే ముందు చాలామంది ముస్లింలో మహమ్మదు ప్రవక్తను ఖననం చేసినట్లు చెప్పే మదీనాను సందర్శిస్తారు.ఇక్కడే మహమ్మదు ప్రవక్త తొలి మసీదును నిర్మించారు. మక్కాలో ప్రార్థనల తర్వాత యాత్రికులు సోమవారం అరఫాత్ కొండను చేరుకుని అక్కడినుంచి ముజ్దలిఫాకు వెళ్లి మినా లోయలో సైతాన్‌ను రాళ్లతో కొట్టే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం మూడు రోజులపాటు సాగుతుంది. దీంతో హజ్ యాత్ర ముగుస్తుంది. కాగా గతంలో హజ్ యాత్రల సందర్భంగా భారీ తొక్కిసలాటలు జరిగి వందలాది మంది మృతి చెందిన నేపథ్యంలో ఈ సారి ఎలాంటి దుర్ఘటనలూ జరక్కుండా చూడడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు.

Comments

comments