స్వీట్ న్యూస్ చెప్పిన షాహిద్

బాలీవుడ్‌లో ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌లో నటిస్తున్నాడు షాహిద్‌కపూర్. ఈ హీరోను ఈమధ్య హ్యాకర్లు ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. షాహిద్‌కపూర్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్ చేసి హంగామా సృష్టిస్తున్నారు. అతని ఖాతా నుండి కత్రినాకు ‘ఐ లవ్ యూ’ అని చెప్పారు. డోనాల్డ్ ట్రంప్ వీడియో ఒకటి పోస్ట్ చేసి ‘మనం గెలుస్తాం’ అన్నారు. దీంతో షాహిద్ లబోదిబోమంటూ సైబర్ క్రైమ్ వారికి ఫిర్యాదు చేశాడు. చివరికి శనివారం ట్విట్టర్ ఖాతా అతని స్వాధీనంలోకి వచ్చింది. ఈ విషయం […]

బాలీవుడ్‌లో ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌లో నటిస్తున్నాడు షాహిద్‌కపూర్. ఈ హీరోను ఈమధ్య హ్యాకర్లు ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. షాహిద్‌కపూర్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్ చేసి హంగామా సృష్టిస్తున్నారు. అతని ఖాతా నుండి కత్రినాకు ‘ఐ లవ్ యూ’ అని చెప్పారు. డోనాల్డ్ ట్రంప్ వీడియో ఒకటి పోస్ట్ చేసి ‘మనం గెలుస్తాం’ అన్నారు. దీంతో షాహిద్ లబోదిబోమంటూ సైబర్ క్రైమ్ వారికి ఫిర్యాదు చేశాడు. చివరికి శనివారం ట్విట్టర్ ఖాతా అతని స్వాధీనంలోకి వచ్చింది. ఈ విషయం గురించి స్పందించిన షాహిద్ “హాయ్ గయ్స్… ఫైనల్‌గా ట్విట్టర్‌లోకి మళ్లీ వచ్చాను. నిజమే నా ఖాతా హ్యాక్ అయింది. దయచేసి గత 24 గంటలుగా నా ట్విట్టర్ నుండి వచ్చిన మెసేజ్‌లను పట్టించుకోవద్దు”అని అన్నాడు. ఇక ఫ్యాన్స్‌కు ఒక స్వీట్ న్యూస్ చెప్పాడు షాహిద్. అతనికి ఇప్పటికే మిషా అనే పాప ఉంది. ఇటీవల షాహిద్‌కు బాబు పుట్టాడు. ఆ బాబుకు జైన్‌కపూర్ అని పేరు పెట్టామని… బాబు రాకతో మేమంతా సంతోషంగా ఉన్నామని తెలిపాడు. తమకు విషెస్ తెలిసిన వారికి, బ్లెస్సింగ్స్ ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పాడు షాహిద్‌కపూర్.

Comments

comments

Related Stories: