స్వాతికి వరుడు దొరికాడట…!

Actress Colors Swathi Marry with Pilot?
హైదరాబాద్: బుల్లితెర‌పై ‘కలర్స్’ ప్రోగ్రామ్‌తో యాంకర్ గా ప‌రిచ‌య‌మైన స్వాతి ఆ తర్వాత టాలీవుడ్ లో వ్యాఖ్యాత, గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పాపులర్ అయింది. అనంతరం కొంతకాలానికి హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. ‘అష్టాచెమ్మా’ సినిమా ఆమె హీరోయిన్‌గా చేసిన మొదటి మూవీ. తక్కువ సినిమాలతోనే తనదైన క్యూట్ లుక్స్, చలాకీ మాటలతో తెలుగులో అభిమానులను సంపాదించుకున్నారు. ఆ త‌ర్వాత ప‌లు తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ మూవీస్ లో న‌టించి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా స్వాతి పెళ్లి గురించి ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇంతకుముందే స్వాతి పెళ్లిపై పలు గాసిప్‌లు వినిపించాయి.
Swathi-with-fiance
అప్పట్లో ప‌లువురు హీరోల‌తో ముడిపెడుతూ ఆమె గురించి వార్త‌లు గుప్పుమన్నాయి. అయితే ఇప్పడు ఆమె పెళ్లి ఫిక్స్ అయింద‌నే వార్త మరోసారి సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ‌లేషియ‌న్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్న వికాస్ అనే వ్య‌క్తిని స్వాతి పెళ్లి చేసుకొనుందని సమాచారం. వీరిద్ద‌రూ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారట. ఈ క్రమంలో పెద్దల వద్ద తమ పెళ్లి ప్రస్తావన తీసుకురావడం, వాళ్లను ఒప్పించడం అన్నీ చకచక జరిగిపోయినట్లు తెలుస్తోంది. అందుకే పెద్ద‌ల అనుమ‌తితో ఈ నెల 30న హైదరాబాద్‌లో ఈ జంట పెళ్లిపీటలెక్కబోతున్నట్టు తెలిసింది. దీనిపై అటు స్వాతి కుటుంబ సభ్యుల నుంచి గానీ, ఇటు వికాస్ ఫ్యామిలీ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ వార్త‌లో నిజ‌మెంతుందో తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే.