స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రయ్య మృతి

వరంగల్ : స్వాతంత్య్ర సమరయోధుడు పడాల చంద్రయ్య (94) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు కన్నుమూశారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆయన చురుకుగా పాల్గొన్నారు. ఆరూర్ రైల్వేస్టేషన్‌లో జరిగిన పోరాటంలో ఆయన కాలులోకి బుల్లెట్ దిగింది. ఆ బుల్లెట్ ఇప్పటి వరకు ఆయన శరీరంలోనే ఉంది. ములుకనూరు సహకార గ్రామీణ బ్యాంకు వ్యవస్థాపకుల్లో చంద్రయ్య ఒకరు అన్న విషయం తెలిసిందే. ఆయన మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు […]

వరంగల్ : స్వాతంత్య్ర సమరయోధుడు పడాల చంద్రయ్య (94) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు కన్నుమూశారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆయన చురుకుగా పాల్గొన్నారు. ఆరూర్ రైల్వేస్టేషన్‌లో జరిగిన పోరాటంలో ఆయన కాలులోకి బుల్లెట్ దిగింది. ఆ బుల్లెట్ ఇప్పటి వరకు ఆయన శరీరంలోనే ఉంది. ములుకనూరు సహకార గ్రామీణ బ్యాంకు వ్యవస్థాపకుల్లో చంద్రయ్య ఒకరు అన్న విషయం తెలిసిందే. ఆయన మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Freedom Fighter Chandraiah Passes Away

Comments

comments

Related Stories: