స్వల్పంగా తగ్గిన పసిడి ధర

ముంబై : గత మూడు రోజుల రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర సోమవారం తగ్గుముఖం పట్టింది. రూపా యి బలపడంతో దేశీయంగానూ పసిడి తగ్గుముఖం పట్టింది. బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల పసిడి ధర రూ.80 తగ్గింది. ఢిల్లీలో 99.9, 99.5 శాతం స్వచ్ఛత కల్గిన పది గ్రాముల పసిడి ధర 80 రూపాయల చొప్పున తగ్గి రూ.30,890, రూ.30,740కు చేరింది.అంతర్జాతీయంగా చూస్తే ఆసియాలో ఔన్స్ పసిడి 2.80 డాలర్లు తగ్గి 1,228.80 డాలర్ల వద్ద […]

ముంబై : గత మూడు రోజుల రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర సోమవారం తగ్గుముఖం పట్టింది. రూపా యి బలపడంతో దేశీయంగానూ పసిడి తగ్గుముఖం పట్టింది. బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల పసిడి ధర రూ.80 తగ్గింది. ఢిల్లీలో 99.9, 99.5 శాతం స్వచ్ఛత కల్గిన పది గ్రాముల పసిడి ధర 80 రూపాయల చొప్పున తగ్గి రూ.30,890, రూ.30,740కు చేరింది.అంతర్జాతీయంగా చూస్తే ఆసియాలో ఔన్స్ పసిడి 2.80 డాలర్లు తగ్గి 1,228.80 డాలర్ల వద్ద ఉంది. వడ్డీ రేట్ల పెంపు బాటలో సాగుతున్న ఫెడరల్ రిజర్వ్ పాలసీలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పు పట్టడంతో డాలర్ ఏడాది గరిష్ట ధర నుంచి దిగివచ్చింది. ఫలితంగా గత శుక్రవారం అమెరికాలో ఔన్స్ పసిడి 1,231.1 డాలర్ల వద్ద ముగిసింది.

Comments

comments

Related Stories: