స్వర్ణ కాంతుల నీరజ్

సత్తా చాటిన అథ్లెట్లు, ఆసియా క్రీడల్లో భారత్ జోరు జకార్తా: ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు వరుసగా రెండో రోజు పతకాల పంట పండించారు. సోమవారం తొమ్మిదో రోజు భారత అథ్లెట్లు స్వర్ణంతో సహా మరో మూడు రజతాలు గెలుచుకున్నారు. మహిళల బ్యాడ్మింటన్‌లో తెలుగుతేజం, స్టార్ షట్లర్ పి.వి.సింధు ఫైనల్‌కు చేరడం ద్వారా మరో రజతం ఖాయం చేసింది. కాగా, సెమీఫైనల్లో ఓడిన మరో స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కూడా కాంస్యం సాధించింది. మరోవైపు పురుషుల […]

సత్తా చాటిన అథ్లెట్లు, ఆసియా క్రీడల్లో భారత్ జోరు

జకార్తా: ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు వరుసగా రెండో రోజు పతకాల పంట పండించారు. సోమవారం తొమ్మిదో రోజు భారత అథ్లెట్లు స్వర్ణంతో సహా మరో మూడు రజతాలు గెలుచుకున్నారు. మహిళల బ్యాడ్మింటన్‌లో తెలుగుతేజం, స్టార్ షట్లర్ పి.వి.సింధు ఫైనల్‌కు చేరడం ద్వారా మరో రజతం ఖాయం చేసింది. కాగా, సెమీఫైనల్లో ఓడిన మరో స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కూడా కాంస్యం సాధించింది. మరోవైపు పురుషుల జావెలిన్ త్రో విభాగంలో స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. ఆసియా క్రీడల్లో ఈ విభాగంలో భారత్ స్వర్ణం సాధించడం ఇదే తొలిసారి. మరోవైపు పురుషుల 400 మీటర్ల హార్డిల్స్‌లో అయ్యస్వామి ధరణ్ రజతం సాధించాడు. మహిళల 3000 మీటర్ల స్టిప్లెచెస్ విభాగంలో భారత అథ్లెట్ సుధా సింగ్ రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకుంది. అంతేగాక మహిళల లాంగ్‌జంప్‌లో వరాకిల్ నీనా రజతం సాధించింది. మహిళల హాకీలో భారత జట్టు మరో భారీ విజయాన్ని అందుకుంది. సోమవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 50 గోల్స్ తేడాతో థాయిలాండ్‌ను ఓడించింది.

చరిత్ర సృష్టించిన చోప్రా…
పురుషుల అథ్లెటిక్స్ విభాగంలో నీరజ్ చోప్రా పసిడి పతకం గెలిచి చరిత్ర సృష్టించాడు. సోమవారం జరిగిన పురుషుల జావెలిన్‌త్రో విభాగంలో నీరజ్ చోప్రా అసాధారణ నైపుణ్యాన్ని కనబరిచి స్వర్ణం సాధించాడు. తనపై కోట్లాది మంది అభిమానులు ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ జావెలిన్‌త్రోలో పసిడి కైవసం చేసుకున్నాడు. అద్వితీయ ప్రతిభతో అలరించిన నీరజ్ చోప్రా 88.06 దూరాన్ని విసిరి అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. ప్రత్యర్థి ఆటగాళ్లకు అందనంత దూరంలో నిలిచిన చోప్రా తన ఖాతాలో తొలి ఆసియా క్రీడల స్వర్ణాన్ని జమ చేసుకున్నాడు. చైనా ఆటగాడు లియు కిజెన్ 82.22 దూరంతో రజతం దక్కించుకున్నాడు. పాకిస్థాన్ ఆటగాడు నదీమ్ అర్షద్‌కు కాంస్యం లభించింది.

ధరుణ్‌కు రజతం..
పురుషుల 400 మీటర్ల హార్డిల్స్‌లో భారత స్టార్ అథ్లెట్ అయ్యస్వామి ధరుణ్ రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకున్నాడు. తన కెరీర్‌లోనే అత్యుత్తమ టైమింగ్‌తో ధరుణ్ ఈ పతకం సాధించాడు. పూర్తి ఏకాగ్రతను కనబరిచిన ధరుణ్ 48.96 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రజతం దక్కించుకున్నాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ధరుణ్ అసాధారణ పోరాట పటిమతో పతకం గెలిచి పెను ప్రకంపనలే సృష్టించాడు. తీవ్ర పోటీ ఉండే ఈ విభాగంలో ఏకంగా రజతం సాధించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మరవైప ఖతార్ అథ్లెట్ సాంబా అబ్దుల్ రహ్మాన్ ఆసియా క్రీడల్లో సరికొత్త రికార్డుతో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. చారిత్రాత్మక ప్రదర్శన ఇచ్చిన రహ్మాన్ 47.66 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరి స్వర్ణం గెలుచుకున్నాడు. జపాన్ అథ్లెట్ టకటోషి కాంస్య పతకాన్ని సాధించాడు.

సుధా సంచలనం..
మరోవైపు మహిళల 3వేల మీటర్ల స్టీపుల్ ఛేజ్ విభాగంలో భారత క్రీడాకారిణి రజతం సాధించి చరిత్ర సృష్టించింది. సోమవారం జరిగిన పోటీల్లో సుధా సింగ్ 9.40.03 నిమిషాల్లో పరుగును పూర్తి చేసి రజత పతకాన్ని గెలుచుకుంది. ప్రారంభం నుంచే జోరును కొనసాగించిన సుధా సింగ్ అసాధారణ నైపుణ్యంతో రెండో స్థానంలో నిలిచింది. బహ్రెయిన్ అథ్లెట్ యావి విన్‌ఫ్రెడ్ 9.36.52 నిమిషాల్లోనే లక్ష్యాన్ని చేరి తన ఖాతాలో స్వర్ణం జత చేసుకుంది. విన్‌ఫ్రెడ్ చిరుత వేగంతో పరుగును పూర్తి చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. వియత్నాం అథ్లె ఎన్గుయెన్‌ను కాంస్యం లభించింది.

Comments

comments

Related Stories: