స్వరూపానంద స్వామి శిష్య స్వీకార దీక్ష

Swarupananda Swami

 

అమరావతి: శారద పీఠ ఉత్తరాధికారిగా కిరణ్ కుమార శర్మ సన్యాస దీక్ష స్వీకరణ మహోత్సమం కృష్టాతీరంలోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో జరిగింది. శారద పీఠాధిపతి స్వరూపానంద స్వామి శిష్య స్వీకార దీక్ష క్రతువు నిర్వహించి, అతనికి యోగపట్టం అందించారు. ఈ కార్యక్రమంలో రెడు రాష్ట్రాల సిఎంలు కెసిఆర్, జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. శిష్యుడు కిరణ్ కుమార శర్మకు స్వాత్వానందేంద్రగా నామకరణం చేశారు. అనంతరం స్వరూపానందస్వామి పాదాలకు స్వాత్మానందేంద్ర సరస్వతి పూజ చేశారు. మూడు రోజుల పాటు హోమం, దీక్షా, వైదిక క్రతువులు వైభవంగా సాగిన్నాయి. సిఎం కెసిఆర్ పై శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రశంసల వర్షం కురిపించి, రెడు రాష్ట్రాల సిెఎంలు కెసిఆర్, జగన్ లు 15 ఏండ్ల పాటు దిగ్విజయంగా పరిపాలించాలని ఆకాంక్షించారు.

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post స్వరూపానంద స్వామి శిష్య స్వీకార దీక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.