స్వరాజ్ ఇండియా పార్టీ చీఫ్ అరెస్ట్…

Yogendra Yadav arrested

చెన్నై: స్వరాజ్ ఇండియా పార్టీ అధ్యక్షుడు, ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్‌ను తమిళనాడు పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. తిరువనమలైలో యోగేంద్రతో పాటు అతని అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిని ఓ వెడ్డింగ్ హాల్‌లో ఉంచామని పోలీసులు వెల్లడించారు. అతిపడిలో జరుగుతున్న 8 లైన్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి యోగేంద్ర యాదవ్ అక్కడకు వెళ్లారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. కృష్ణగిరిలోని రైతులతో సమావేశమైన యాదవ్‌ను ఆ తరువాత పోలీసులు అదుపులోకి తీసుకోవడంతోపాటు, ఆయన సెల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

Comments

comments