స్వయం ఉపాధితో యువత సన్మారం

శంకరపట్నం: మండలానికి చెందిన సతీష్ ఉపాధి లేక.. ఉద్యోగం రాక.. నానా ఇబ్బందులు పడ్డాడు. కష్టపడి ఉన్నత చదువులు పూర్తి చేశాడు. తల్లిదండ్రులు దినసరి కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారి కష్టాన్ని చూసి తానూ సహాయపడాలనుకున్నాడు. చదువుకు తగిన ఉద్యోగం రాకపోయినా.. ఏదైనా చిన్నపాటి ఉద్యోగం చేద్దామనుకున్నాడు. పలు కంపెనీల చూట్టూ తిరిగాడు. ఉద్యోగం దొరకలేదు. నిరాశ చెందాడు. చేసేది లేక తండ్రి చేసే కూలీ పనికే వెళ్దామని నిర్ణయించుకున్ని పనిలో చేరాడు. రోజంతా కష్టపడితే […]


శంకరపట్నం: మండలానికి చెందిన సతీష్ ఉపాధి లేక.. ఉద్యోగం రాక.. నానా ఇబ్బందులు పడ్డాడు. కష్టపడి ఉన్నత చదువులు పూర్తి చేశాడు. తల్లిదండ్రులు దినసరి కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారి కష్టాన్ని చూసి తానూ సహాయపడాలనుకున్నాడు. చదువుకు తగిన ఉద్యోగం రాకపోయినా.. ఏదైనా చిన్నపాటి ఉద్యోగం చేద్దామనుకున్నాడు. పలు కంపెనీల చూట్టూ తిరిగాడు. ఉద్యోగం దొరకలేదు. నిరాశ చెందాడు. చేసేది లేక తండ్రి చేసే కూలీ పనికే వెళ్దామని నిర్ణయించుకున్ని పనిలో చేరాడు. రోజంతా కష్టపడితే వచ్చేది రూ. మూడు వందలే. మదన పడ్డాడు. మనస్సు ఒప్పుకోకపోయినా పని చేస్తున్నాడు. రోజులు గడుస్తున్నాయి, పనిచేస్తున్నా ఏదో ఆలోచన. తాను నలుగురిలో ఒకడిలా కాకుండా నలుగురికి ఉపాధి చూపాలనుకున్నాడు. లక్షం ఎంచుకున్నాడు. ఆచరణలో పెట్టాడు. అడుగుముందుకేసి అమలు చేశాడు. చిన్న పరిశ్రమను స్థాపించాడు. తాను పని చేసేదే కాక మరో పది మందికి పని కల్పించాడు. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా లబ్ధి పొందాడు. పలువురికి ఆదర్శంగా నిలిచాడు. ఉన్నత స్థాయిలో స్థిరపడ్డాడు. ఆలోచనకు పదునుపెట్టి.. దాన్ని ఆచరణలో పెట్టి ఉపాధితో యువత మంచి మార్గాన్ని ఎంచుకోవచ్చని నిరూపించాడు.

పిఎంఇజిపిలో ఎంపిక ఇలా..
పిఎంఇజిపి పథకంలో 18 సంవత్సరాల నుంచి 50 ఏళ్లలోపు వారు అర్హులు. ముందుగా అంతర్జాలంలో పేర్లను నమోదు చేసుకోవాలి. అభ్యర్థుల ఎంపికకు కలెక్టర్ అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ కమిటిని నియమిస్తారు. కమిటి సభ్యులు క్షుణంగా పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అనంతరం బ్యాంక్ రుణ మంజూరికి పంపిస్తారు. ఎంపిక చేసిన అభ్యర్థులను రెండు వారాల పాటు శిక్షణను ఇప్పిస్తారు. ఈ శిక్షణలో అభ్యర్థులు ఎంచుకున్న రంగాలపై మెలుకువలు నేర్పిస్తారు. నిష్నాతులుగా తీర్చిదిద్ది మొదటి విడత రుణం మంజూరు చేస్తారు. యూనిట్ స్థాపించిన తరువాత మిగితా రుణాన్ని అందజేస్తారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన వారికి రూ. పది లక్షల వరకు, పట్టణ వాసులకు రూ. 25 లక్షల వరకు రుణం పొందెందుకు అర్హులు. అభ్యర్థులు ఏదైన తయారీ రంగం, సేవారంగాలకు సంబంధించిన పరిశ్రమలను స్థాపించాల్సి ఉంటుంది.

రుణాలు అందించే బ్యాంకులు..
అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్(బ్యాంక్ ఆఫ్ ఇండియా), బ్యాంకు రుణాలు ఇస్తాయి. ఇవే కాకుండా ప్రయివేటు రంగ సంస్థలైన ఐఎన్‌జి బ్యాంక్, కరూర్ విజయా, యాక్సిస్, కెనరా, ఐసిఐసిఐ, ధనలక్ష్మీ, లక్ష్మీ వికాస్, సౌత్ ఇండియన్, ఫెడరల్, కృష్ణా బీమా సంవృద్ధి, హెచ్‌డిఎఫ్‌సి, జిల్లా కో ఆపరేటీవ్ బ్యాంకులూ రుణాలు అందిస్తాయి. అభ్యర్థులు ఏదైన ఒక బ్యాంకును ఎంచుకొని లబ్ధి పొందవచ్చు.

Related Stories: