స్వచ్ఛంగా సర్కారు బడులు

పారిశుద్ధ కార్మికులు, కాపలా దారుల నియమాకం మొక్కల సంరక్షణతో పెరగనున్న పచ్చదనం విలువైన వస్తువులకు రక్షణ కల్పించడంపై సర్కారు దృష్టి మన తెలంగాణ/ఖమ్మం : పరిశుభ్రమైన పరిసరాలు, ఆహ్లాదకరమైన వా తావరణం ఉంటేనే ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు విద్యార్థులకు సరిగ్గా వంటబడతాయి. అలాగే మరుగుదొడ్ల నిర్వహణ సరిగ్గా ఉంటేనే విద్యార్థులు, ఉపాధ్యాయులకు సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే సంబంధిత పనులు నిర్వహించే వారు లేకపోవడంతో పాఠశాలలో పారిశుద్ధ లోపం నెలకొంటుంది. మరుగుదొడ్లు ఆధ్వాన్నంగా మారి దుర్వాసన వెలువడేది. ఇది […]

పారిశుద్ధ కార్మికులు, కాపలా దారుల నియమాకం
మొక్కల సంరక్షణతో పెరగనున్న పచ్చదనం
విలువైన వస్తువులకు రక్షణ కల్పించడంపై సర్కారు దృష్టి

మన తెలంగాణ/ఖమ్మం : పరిశుభ్రమైన పరిసరాలు, ఆహ్లాదకరమైన వా తావరణం ఉంటేనే ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు విద్యార్థులకు సరిగ్గా వంటబడతాయి. అలాగే మరుగుదొడ్ల నిర్వహణ సరిగ్గా ఉంటేనే విద్యార్థులు, ఉపాధ్యాయులకు సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే సంబంధిత పనులు నిర్వహించే వారు లేకపోవడంతో పాఠశాలలో పారిశుద్ధ లోపం నెలకొంటుంది. మరుగుదొడ్లు ఆధ్వాన్నంగా మారి దుర్వాసన వెలువడేది. ఇది విద్యార్థుల చదువుపై ప్రభావం చూపేది. ఈ నేపథ్యంలో సంపూర్ణ పారిశుద్దంలో భాగంగా సర్కారు బడుల్లో స్వచ్చత నెలకొల్పడంపై ప్రత్యేక దృష్టిసారించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల స్థితి గతులు, అవసరాలు గుర్తించి 2016-17 విద్యా సంవత్సరం నుంచి తాత్కాలిక పద్దతిలో పారిశుద్ధ కార్మికులు, రాత్రి కాపలా దారుల నియమాకానికి చర్యలు చేపట్టింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో వీరిని నియమిస్తారు. 100 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న ఉన్నత పాఠశాలల్లో ఇద్దరు పారిశుద్ధ కార్మికులతో పాటు ఒక రాత్రి కాపలా దారు, 100 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న ఉన్నత పాఠశాలలకు ఒక పారిశుద్ధ కార్మికుడు, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలో ఒకరు చొప్పున పారిశుద్ధ కార్మికులను నియమించుకునే అవకాశం ఉంది. జిల్లాలోని 21 మండలాల పరిధిలో మొత్తం 211 ఉన్నత, 192 ప్రాథమికోన్నత, 810 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కలిపి 1354 మందిని నియమించుకునే అవకాశం ఉంది. పాఠశాల యాజమాన్య కమిటీల ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులు, రాత్రి కాపలాదారులను నియమిస్తారు. వీరి నియమాకానికి అనుమతిని ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు ఆ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. కొత్తగా నియమితులయ్యేవారు జూన్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు పది నెలలు విధులు నిర్వర్తించాలి. 40 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉండే ఉన్నత పాఠశాలల్లో నియమితులైన వారికి నెలకు రూ.2,500 వేతనం, 40 మంది లోపు విద్యార్థులుంటే ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల్లో నియమితులయ్యే వారికి నెలకు రూ.2వేల వేతనం ఇస్తారు.
ఇబ్బందులు దూరం : పారిశుద్ధ కార్మికులను నియమించనుండడంతో విద్యాలయాలన్నీ స్వచ్ఛతకు నిలయాలుగా మారుతున్నాయి. ప్రతి రోజు గదులు ఊడ్చి చెత్తా చెదారం తొలగించడం వల్ల బడి పరిసరాలన్నీ పరిశుభ్రంగా మారుతున్నాయి. అంతేగాక మరుగుదొడ్లు శుభ్రం చేయడం నీరు పోయడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బందులు తొలగిపోతాయి. అంతేగాక హరితహారంలో భాగంగా పాఠశాలల్లో నాటే మొక్కల సంరక్షణ బాధ్యత కూడా వీరే చూడ నుండడంతో అవి బాగా ఎదిగి పచ్చదనం పరుచుకుని ఆహ్లాదకర వాతావరణం నెలకొననుంది.

Related Stories: