ముంబయి: ప్రముఖ మొబైల్ తయారీదారు హెచ్ఎండి గ్లోబల్ సంస్థ తన కొత్త స్మార్ట్‌ఫోన్ నోకియా 2.1ను తాజాగా విడుదల చేసింది. 1 జిబి ర్యామ్, 8 జిబి ఇంటర్నల్ స్టోరేజీ గల ఈ ఫోన్ ధర కేవలం రూ.6,999 మాత్రమే. బ్లూ/కాపర్, గ్రే/సిల్వర్, బ్లూ/సిల్వర్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ కస్టమర్ల కోసం సంస్థ అందుబాటులో ఉంచింది. ఆదివారం నుంచి వినియోగదారులకు ఈ ఫోన్ లభ్యం కానుంది. పేటీఎం మాల్ క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. అలాగే ఐడియా, వొడాఫోన్ కస్టమర్లకు అదనపు డేటాను అందిస్తున్నారు.
నోకియా 2.1 ఫీచర్ల విషయానికి వస్తే…
5.5 ఇంచ్ హెచ్డి డిస్ప్లే( 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్)
1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్
1 జిబి ర్యామ్, 8 జిబి ఇంటర్నల్ స్టోరేజ్(128 జిబి వరకు విస్తరించుకునే సదుపాయం)
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్
8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జి విఒఎల్టిఇ
బ్లూటూత్ 4.1
4100 ఎంఎహెచ్ బ్యాటరీ
డ్యూయల్ సిమ్
Comments
comments