స్ప్రింగ్ క్లీనింగ్‌తో ఉపయోగాలెన్నో..

benefits with spring cleaning

ఇంటిని పరిశుభ్రంగా ఉండటానికి, శరీర ఆరోగ్యా నికి గట్టి సంబంధం ఉంది.  ఇల్లంతా అద్దంగా నీట్ గా ఉంటే మనస్సూ, శరీరం రెండూ సేదదీరిపో తాయి.అలాంటి ఇంట్లో స్ప్రింగ్ క్లీనింగ్ చేసుకుంటే బహుళ ప్రయోజనాలు లభిస్తాయి. శారీరకంగా కష్టపడటం వల్ల ఒత్తిడి తగ్గుతుందంటే నమ్మశక్యంగా ఉండక పోవచ్చు. ఏకాగ్రత పెరిగి, ఒత్తిడి ఇట్టే దూరమవుతుంది. శుభ్రంగా ఉండే ఇల్లు ప్రశాంతంగా సమస్యలు పరిష్కరిం చుకోవటానికి ఆస్కారం ఇస్తుంది. ఇతర పనులు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. దుమ్మూ, ధూళి లేకపోతే ఎలర్జీలు లాంటివి దరిచేరవు. ముందుగా వంట గది శుభ్రం చేయడం ఆరంభించాలి. ఇదే ఆరోగ్యానికి కీలకం కాబట్టి ఇక్కడి నుంచి ఆరంభిస్తే మంచిది.

1 స్క్రబ్ చేయకుండా బర్నర్లను శుభ్రపరుచుకునే వీలుంది. వీటిని టైట్ ప్లాస్టిక్ బ్యాగ్‌లో వేసి, పావు కప్పు అమ్మోనియా వెయ్యాలి. ఓ రాత్రంతా అలా ఉంచేసి మరునాడు మెత్తటి స్పాంజితో తుడిచెయ్యాలి.
2 నిమ్మరసంలో చాకులు నానబెడితే తుప్పు, ఇతరత్రా మరకలు వదలిపోతాయి. శుభ్రం చేసి పొడిగా తుడిచి వాటిని పక్కన పెట్టుకోవాలి. లేకపోతే వాటికున్న పదును పోతుంది.
3 నీరు, వెనిగర్, నిమ్మరసం కలిపి సింక్ డ్రెయిన్‌లో పోస్తే సింక్‌లో ఉన్న అడ్డుపడే పదార్థాలన్నీ తొలగి పోతాయి. సింకు కింద పైపులో ఉన్న బాక్టీరియా తొలగిపోతుంది.
4 పింగాణి లేదా వెండి సామానుపై మరకలు వదలాలంటే బేకింగ్ సోడాలో వస్త్రాన్ని ముంచి తుడవాలి.
5 సింకులు, గట్లు క్లీన్ చేస్తున్నప్పుడు ప్రతి క్లీనింగ్ తర్వాత మైల్ వ్యాక్స్‌తో కోట్ చేస్తే సమయం ఆదా అవుతుంది. ఇలా చేయడం వల్ల మురికి, నీళ్లు జారిపోతాయి, గోడదగ్గర నిలవకుండా ఉంటాయి.
6 సోఫాలవంటి వాటిని క్లీన్ చెయ్యడానికి ముందు బ్రెష్ లేదా వ్యాక్యూమ్ క్లీనర్ నాజిల్‌పై కొద్దిగా స్పిరిట్ లేదా నెయిల్ పాలిష్ రిమూవర్ వేసి స్ప్రే చేస్తే మరకలన్నీ సులువుగా వదిలేస్తాయి.
7 ఫ్రిజ్‌లోని అరలన్నీ తీసేసి, రూమ్ టెంపరేచర్‌కు వచ్చేదాకా ఆగి ఫ్రిజ్ క్లీన్ చెయ్యాలి. భారీ మరకలు, పదార్థాలు ఒలికిన ఆనవాళ్లు ఉన్నట్లయితే వేడినీళ్లు, ఆమ్మోనియా 5:1 నిష్పత్తిలో తీసుకుని, చిమ్మి కొద్దిసేపు నాననిచ్చి తుడిచేసుకోవాలి.
8 లెవెండర్ లేదా టీట్రీ వంటి ఎస్సెన్షియల్ ఆయిల్ కొద్ది చుక్కల్ని కప్పు బేకింగ్ సోడాలో కలిపి ఏరోసోల్‌తో పరుపులపై జల్లాలి. ఒక గంట తర్వాత వ్యాక్యూమ్ క్లీనర్‌తో క్లీన్ చేయాలి. బేకింగ్ సోడా మురికినీటినంతటినీ గ్రహిస్తుంది. తేమ, వాసనల్ని ఎసెన్షియల్ ఆయిల్స్ పోగొట్టి తాజా సువాసనలు వెదజల్లుతాయి.
9 కిటికీ ట్రాక్స్‌లో ఇరుకుగా ఉన్న స్థలాలలో ఇయర్‌బడ్ ఉపయోగించి, తరువాత క్లీన్ పేపర్ టవల్‌తో తుడిచేయాలి. అప్పుడు అంతా శుభ్రంగా ఉంటుంది.
10 బ్లెండర్ తీసి, సింకులో కడిగేకంటే లిక్విడ్ సోప్ నీటిలో వేసి, ఓ నిముషం సేపు రన్‌చేస్తే బాగా శుభ్రపడుతుంది.
11 బేకింగ్ సోడా, నీరు, డిష్ డిటర్జెంట్ కలిపి ఓవెన్ శుభ్రం చేయాలి. ఏరోసోల్‌లో పోసి ఓవెన్‌పై స్ప్రే చేసి, వస్త్రంతో రబ్ చేయాలి.
12 బ్లీచ్ వేసి ఒకసారి, వైట్ వెనిగర్ వేసి రెండవసారి రన్ చేస్తే వాషింగ్ మిషన్ క్లీన్ అవుతుంది. చివరలో నీళ్లు పోసి కొద్దిసేపు ఆన్‌చేసి, డ్రెయిన్ చేయాలి.
13 ప్రతి ఫ్యాన్ బ్లేడును దిండు గలీబుతో చుట్టేసి నెమ్మదిగా లాగితే దుమ్ము, మురికి దిండు గలీబులోకి చేరిపోతాయి. నేలపై దుమ్ము పడదు. ఫ్యాన్ బ్లేడ్లు క్లీన్ అవుతాయి.