స్పెషల్ సాంగ్‌తో పెరిగిన అంచనాలు

Samantha Akkineni in UTurn Movie

సమంత ప్రధాన పాత్రలో పవన్‌కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘యు టర్న్’. ఈ చిత్రం  ఈనెల 13న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే సినిమా విడుదల హక్కులు మంచి రేట్లకు అమ్ముడయ్యాయి. ఈ చిత్రాన్ని మరింతగా ప్రేక్షకులకు చేరువ చేసేందుకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో ఒక స్పెషల్ సాంగ్ చేయించారు. ‘కర్మ థీమ్’ అంటూ వచ్చిన ఈ సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ పాటతో సినిమాపై అంచనాలను పెంచడంలో సమంత విజయం సాధించింది. ఈ చిత్రం విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో భూమిక, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.