స్కూల్ వ్యాన్ ను ఢీకొన్న కారు

Auto-Accident

పెద్దపల్లి: స్కూల్ వ్యాన్, కారు ఢీకొన్న ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి వద్ద బుధవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో చంద్రమోహన్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చంద్రమోహన్ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో జరిగినప్పుడు స్కూల్ వ్యానులో 25 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.