స్కాష్‌లో రజతం…

ఇదిలావుండగా మహిళల స్కాష్ విభాగంలో భారత్‌కు రజతం లభించింది. స్వర్ణం గెలుస్తుందని భావించిన స్కాష్ జట్టు ఫైనల్లో ఓటమి పాలై రజతంతో సంతృప్తి పడింది. శనివారం హాంకాంగ్‌తో జరిగిన ఫైనల్లో భారత్ 02 తేడాతో ఓటమి పాలైంది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మహిళా జట్టు అంచనాలకు తగినట్టుగా ఆడలేక పోయింది. తీవ్ర ఒత్తిడికి గురైన భారత జట్టు ప్రత్యర్థి జట్టుపై ఏమాత్రం ఆధిపత్యం చెలాయించలేక పోయింది. దీపిక పల్లికల్, జోష్న చినప్ప, సునయనా కురువిల్లా, తాన్విఖన్నాలతో కూడిన […]

ఇదిలావుండగా మహిళల స్కాష్ విభాగంలో భారత్‌కు రజతం లభించింది. స్వర్ణం గెలుస్తుందని భావించిన స్కాష్ జట్టు ఫైనల్లో ఓటమి పాలై రజతంతో సంతృప్తి పడింది. శనివారం హాంకాంగ్‌తో జరిగిన ఫైనల్లో భారత్ 02 తేడాతో ఓటమి పాలైంది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మహిళా జట్టు అంచనాలకు తగినట్టుగా ఆడలేక పోయింది. తీవ్ర ఒత్తిడికి గురైన భారత జట్టు ప్రత్యర్థి జట్టుపై ఏమాత్రం ఆధిపత్యం చెలాయించలేక పోయింది. దీపిక పల్లికల్, జోష్న చినప్ప, సునయనా కురువిల్లా, తాన్విఖన్నాలతో కూడిన భారత జోడీ ఫైనల్లో పేలవమైన ఆటతో పరాజయం చవిచూసింది. ఈ క్రీడల్లో భారత మహిళా క్రీడాకారిణిలు అసాధారణ ఆటను కనబరిచారు. అయితే పసిడి పతకం సాధించాలనే కలను మాత్రం అందుకోలేక పోయారు. ఈ మ్యాచ్‌లో ఓడినా భారత జట్టు అంచనాలకు మించి రాణించిందనే చెప్పాలి. ఇక, పురుషుల టీమ్ విభాగంలో భారత్‌కు కాంస్య పతకం లభించిన విషయం తెలిసిందే. అంతకుముందు మహిళల సింగిల్స్ విభాగంలో దీపిక, జోష్నలు కాంస్య పతకాలు సాధించారు.

Comments

comments

Related Stories: