సోషల్ మీడియా హబ్‌పై కేంద్రం వెనక్కి..

Centre withdrawing notification on social media hub

న్యూఢిల్లీ: సోషల్ మీడియా హబ్ ద్వారా భారత పౌరుల ఆన్‌లైన్ కదలికలను పర్యవేక్షిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో కేంద్రం ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మీడియా హబ్ ఏర్పాటు నోటిఫికేషన్‌ను ఉపసంహరిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలియజేశింది. సోషల్ మీడియా హబ్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన ఫిటిషన్లను కొట్టిపారేస్తున్నట్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా స్పష్టం చేశారు. అటార్నీజనరల్ కెకె వేణుగోపాల్ ఇచ్చిన వివరణ ప్రకారం సుప్రీంకోర్టు ఈ తీర్పును ఇచ్చింది. సోషల్ మీడియా విధానంపై కేంద్రం సంపూర్ణంగా సమీక్షించనున్నట్టు వేణుగోపాల్ కోర్టుకు వివరించి చెప్పారు. ప్రజల వ్యాట్సాప్ మెసేజ్‌లను ట్యాప్ చేసేందుకు సోషల్ మీడియా హబ్‌ను ఏర్పాటు చేస్తున్నారా..? అని గత వాదనల్లో న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.