సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణానికి మోక్షం ఎప్పుడో ?

మన తెలంగాణ/కొల్లాపూర్ : కొల్లాపూర్ నియోజకవర్గం ప్రజల చిరకాల వాంఛ ఆయిన సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం జరగక పోవడంపై ఈ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతానికి రాయల్‌సీమలో బంధువులు ఉండటంతో ఇక్కడినుండి అక్కడికి వెళ్ళాంటే కర్నూల్ జిల్లా కేంద్రం మీదగా వెళ్ళుటకు 50కిలో మీటర్లు ఎక్కువగా ప్రయాణం కొనసాగించాల్సివస్తుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతే ఇటునుండి కర్నూల్, నందికోట్కూరు, నంద్యాలకు త్వరగా చేరుకోవచ్చునని వారి ఆలోచన ఉంది.. గతంలో సింగోటం శ్రీలక్ష్మీనరసింహ్మ […]

మన తెలంగాణ/కొల్లాపూర్ : కొల్లాపూర్ నియోజకవర్గం ప్రజల చిరకాల వాంఛ ఆయిన సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం జరగక పోవడంపై ఈ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతానికి రాయల్‌సీమలో బంధువులు ఉండటంతో ఇక్కడినుండి అక్కడికి వెళ్ళాంటే కర్నూల్ జిల్లా కేంద్రం మీదగా వెళ్ళుటకు 50కిలో మీటర్లు ఎక్కువగా ప్రయాణం కొనసాగించాల్సివస్తుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతే ఇటునుండి కర్నూల్, నందికోట్కూరు, నంద్యాలకు త్వరగా చేరుకోవచ్చునని వారి ఆలోచన ఉంది.. గతంలో సింగోటం శ్రీలక్ష్మీనరసింహ్మ స్వామి బ్రహ్మోత్సవాలకు కర్నూల్ జిల్లా వాసులు నాటు పడువలో వస్తూ 60మంది జల సమాధి అయిన విషయం తెలిసిందే.  అప్పటి దివంగత సియం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వెంటనే సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కొల్లాపూర్‌లో శిలఫలకాని ఏర్పాటు చేశారు. కాని నేటికి శిలాఫలకం దర్శనం ఇస్తుందికాని బ్రిడ్జి నిర్మాణంపై స్పష్టత కరువైందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నుండి కృష్ణానదిలో సాయిల్ టెస్టు చేయించింది. అప్పుడు అందరు ఇక బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందిలే అని అందరు సంతోషించారు. కాని సాయిల్ టెస్టు చేసి రెండు సంవత్సరాలు గడిచిన నేటికి బ్రిడ్జి నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా తయారైంది. సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం జరుగుతే ఇక్కడనుండి రవాణా పెరిగి వ్యాపారం పెరగడంతోపాటు, ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చేందుతుందని ఇక్కడి ప్రజల ఆలోచన.అలాగే కర్నూల్, నంద్యాల, నందికోట్కూర్‌కు వెళ్ళుటకు దగ్గర కావడంతో పాటు హైద్రాబాద్‌నుండి వచ్చు వాహానాలకు 70కిలో మీటర్ల దూరం తగ్గుతుంది.ఇప్పటికి నది ద్వారా మరబోటులో నిత్యం ప్రజలు ప్రయాణం సాగిస్తున్నారు.ఎప్పుడు ఏమి జరుగుతుందో అర్థంకాని పరిస్థితిలో ప్రాణాలు  అరిచేతులలో పెట్టుకోని ప్రయాణం సాగిస్తున్నారు. బిడ్జి నిర్మాణం జరుగుతే స్వేచ్ఛగా వాహనాలలో వెళ్ళవచ్చునని రెండు రాష్ట్రాల మద్య మంచి సంబంధాలు పెరుగుతాయని ఇక్కడిలు నిత్యం చర్చించుకునే అంశం ఇది. ఇప్పటికైన ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఈప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Related Stories: