సోమనాథ్ ఛటర్జీ పరిస్థితి విషమం

కోల్‌కతా : లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో ఈనెల 10న చేరారు. ఆయనకు వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సోమనాథ్ ఛటర్జీ 1971 నుంచి 2009 వరకు లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. మధ్యలో 1984లో ఆయన తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ చేతిలో ఓడిపోయారు. 1968లో సిపిఎంలో చేరిన ఛటర్జీ, 2008 వరకు అదే పార్టీలో కొసాగారు. యుపిఎ-1 […]

కోల్‌కతా : లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో ఈనెల 10న చేరారు. ఆయనకు వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సోమనాథ్ ఛటర్జీ 1971 నుంచి 2009 వరకు లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. మధ్యలో 1984లో ఆయన తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ చేతిలో ఓడిపోయారు. 1968లో సిపిఎంలో చేరిన ఛటర్జీ, 2008 వరకు అదే పార్టీలో కొసాగారు. యుపిఎ-1 ప్రభుత్వంలో ఆయన లోక్‌సభ స్పీకర్‌గా పని చేశారు. యుపిఎ-1కి సిపిఎం మద్ధతు ఉపసహరించుకున్నప్పటికీ, ఆయన లోక్‌సభ స్పీకర్‌గా కొనసాగారు. దీంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.

Comments

comments