సోనియా, రాహుల్‌కు చుక్కెదురు

Sonia Gandhi, Son Rahul's case rejected by delhi high court

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, అమె కొడుకు రాహుల్ గాంధీలకుఢిల్లీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆదాయపన్నుకేసును పునర్ విచారించడాన్ని నిలిపివేయాలని చేసిన అభ్యర్థనను హైకోర్టు సోమవారం కొట్టిపారేసింది. 2011-12 సంవత్సరంలో రాహుల్, సోనియా గాంధీల ఆదాయం పన్ను కేసులో విచారణ జరుగుతోంది. రిట్ పిటీషన్లను విఫలమైనట్టు జడ్జిలు వెల్లడించారు. మరో కాంగ్రెస్ నేత ఆస్కార్ ఫెర్నాండేజ్ అభర్థనను తోసిపుచ్చినట్టు కోర్టు తెలిపింది. సోనియా తరహాలోనే ఫెర్నాండేజ్ కూడా ఆదాయపన్ను కేసును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.