‘సైరా’లో సుదీప్ పస్ట్ లుక్..

Kiccha Sudeep Syraa Movie First Look Released

హైదరాబాద్‌: చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న చారిత్రక నేపథ్య చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్‌రెడ్డి దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ నటుడు సుదీప్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం సుదీప్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘సైరా’లో ఆయనకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘‘మా అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్‌నకు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘సైరా నరసింహారెడ్డిలోని ‘అవుకురాజు’ డైనమిక్‌ లుక్‌ మీకోసం’’ అని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సుదీప్‌ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. ఈ చిత్రంలో సుదీప్‌ ‘అవుకు రాజు’ అనే పాత్రలో నటిస్తున్నారు. నల్లని దుస్తులు ధరించిన సుదీప్‌ కోర మీసాలు, గడ్డంతో పాటు కుడి భుజంపై గొడ్డలి, ఎడమవైపు ఒరలో కత్తితో ఓ వీరుడిలా నిలబడ్డారు. అయితే, ఆయన పాత్ర చిత్రణ ఎలా ఉంటుందో తెరపైనే చూడాలి.

Comments

comments