‘సైరా’మ్యాజిక్ డైరెక్టర్ ప్రోమో…(వీడియో)

హైదారబాద్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్‌తో  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. బ్రిటిష్ వారితో పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తీస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.   చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘సైరా’కు తొలుత సంగీత దర్శకుడిగా అస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ను అనుకున్నారు. కానీ, ఆయన తప్పుకోవడంతో ఆపై తమన్ లైన్ లోకి వచ్చాడు. కొన్నిరోజులు దేవిశ్రీ ప్రసాద్ పేరు కూడా వినిపించింది. చివరకు అవకాశం […]

హైదారబాద్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్‌తో  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. బ్రిటిష్ వారితో పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తీస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.   చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘సైరా’కు తొలుత సంగీత దర్శకుడిగా అస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ను అనుకున్నారు. కానీ, ఆయన తప్పుకోవడంతో ఆపై తమన్ లైన్ లోకి వచ్చాడు. కొన్నిరోజులు దేవిశ్రీ ప్రసాద్ పేరు కూడా వినిపించింది. చివరకు అవకాశం బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేదికి దక్కించి. సంగీత దర్శకుడిగా అమిత్ ను తీసుకున్నట్టు చెబుతూ, చిత్ర బృందం ఓ ప్రోమోను విడుదల చేసింది. హిందీలో ‘ఉడాన్’, ‘నో వన్‌ కిల్డ్‌ జెస్సికా’, ‘ఇషక్‌ జాదే’, ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’, ‘వేక్‌ అప్‌ సిద్’, ‘ఐషా’, ‘దేవ్‌ డి’, ‘బాంబే వెల్వెట్‌’, ‘ఉడ్తా పంజాబ్‌’, ‘క్వీన్’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు అమిత్ స్వరాలు అందించిన సంగతి తెలిసిందే.

దీంతో అతడిపై నమ్మకంతో చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఈ ప్రోమోను విడుదల చేయగా, ఇప్పటికే లక్షన్నర మందికి పైగా దీన్ని వీక్షించారు. ఇక ఈ సినిమా ఇటీవలె రెండో షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సురేంద‌ర్ రెడ్డి హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. దీనికోసం హాలీవుడ్ నుంచి టెక్నీషియన్స్ ను రప్పించింది చిత్ర యూనిట్. చిరు తనయుడు రాంచరణ్ మూవీని భారీ బడ్జెట్‌తో ప్ర‌తిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ తోపాటు బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ స్టార్లు నటిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌తో పాటు, విజయ్ సేతుపతి, సుదీప్, న‌య‌న‌తార‌, జగపతిబాబు లాంటి స్టార్లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే మెగా డాటర్ నిహారిక కూడా ఒక ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నుందని సమాచారం.

Related Stories: