సెల్ ఫోన్ పేలి యువకుడి దుర్మరణం..

Cell phone explode In Adilabad

ఆదిలాబాద్:  జ్ఞానేశ్వర్ అనే యువకుడు ఇంట్లో సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ఫోన్ పేలి యువకుడు మృతి చెందిన సంఘటన జిల్లాలోని గాదిగూడ మండలం  ముత్యంబట్టి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి మృతితో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.