సెల్ టవర్ ఎక్కి మందుబాబు హల్ చల్

Haryana man climb cell tower for rs. 200 for Liquor

చండీగఢ్: ఓ మందబాబు తనకు ఇంట్లోవాళ్లు తాగడానికి డబ్బులు ఇవ్వడం లేదంటూ ఏకంగా సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేసిన సంఘటన హర్యానాలోని నయీవాలా గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే ఓం ప్రకాష్ అనే యువకుడు ఇటీవల మద్యానికి బానిసైయ్యాడు. దాంతో తరచూ కుటుంబ సభ్యులను మద్యానికి డబ్బులు ఇవ్వాల్సిందేనంటూ హింసిస్తున్నాడు. విసుగెత్తిన ఇంట్లోనివారు ప్రకాష్ కు డబ్బులు ఇవ్వడం లేదు. దాంతో ఇంట్లోనివారు మద్యానికి రూ. 200 ఇవ్వలేదని ఆగ్రహించి టవర్ ఎక్కేశాడు. సుమారు రెండు గంటలపాటు ఆ టవర్ మీదనే ఉండి గ్రామస్థులను హడలెత్తించాడు. తనకు వెంటనే మద్యానికి డబ్బులు ఇవ్వాలని లేనిపక్షంలో పైనుంచి దూకెస్తానంటూ బెదిరించాడు. చివరికి గ్రామస్థులు ఎలాగోలా అతడిని బుజ్జగించి కిందకు రప్పించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Comments

comments